Breaking News

కొత్త ఎమ్మెల్యేల్లో 82 మందిపై కేసులు

Published on Thu, 12/07/2023 - 00:56

సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచిన మొత్తం 119 మంది ఎమ్మెల్యేల్లో 82 మందిపై క్రిమినల్‌ కేసులు ఉన్నాయి. వీరిలో అందరికంటే ఎక్కువగా కాంగ్రెస్‌ పార్టీ 85 మందికి సీట్లు కేటాయించగా వారిలో 51 మంది విజయం సాధించి అసెంబ్లీలో అడుగుపెట్టనున్నా రు. బీజేపీ నుంచి బరిలో నిలిచిన 79 మందిలో ఏడుగురు, బీఆర్‌ఎస్‌ తరఫున పోటీ చేసిన 57 మందిలో 19 మంది, ఏఐఎంఐఎం కేటాయించిన ఐదుగురిలో నలుగురు గెలిచా రు.

కాగా సీపీఐ నుంచి గెలిచిన కూనంనేని సాంబశివరా వుపై కూడా క్రిమినల్‌ కేసులు ఉన్నాయని అసోసియేషన్‌ ఫర్‌ డెమోక్రాటిక్‌ రిఫామ్స్‌ (ఏడీఆర్‌), తెలంగాణ ఎలక్షన్‌ వాచ్‌ సంస్థలు వెల్లడించాయి. 119 నియోజకవర్గాల్లో గెలుపొందిన ఎమ్మెల్యేల అఫిడవిట్ల ఆధారంగా ఈ సంస్థలు బుధవారం ఒక నివేదికను విడుదల చేశాయి. 

ఆస్తుల్లో అగ్రస్థానంలో వివేక్‌
ప్రధాన రాజకీయ పార్టీల నుంచి గెలిచిన 119 మందిలో 114 (96%) మంది కోటీశ్వరులు ఉన్నారు. అత్యధికంగా కాంగ్రెస్‌ నుంచి 60 (94%) మంది, బీఆర్‌ఎస్‌ నుంచి 38 (97%) మంది, బీజేపీ నుంచి 8 (100%) మంది, ఏఐఎంఐఎం నుంచి ఏడుగురు (100%), సీపీఐకి చెందిన ఒకరు (100%) తమకు కోటి రూపాయలకు పైగా ఆస్తులు ఉన్న ట్లు వెల్లడించారు. చెన్నూర్‌ నియోజకవర్గం నుంచి గెలిచిన గడ్డం వివేకానంద్‌ (కాంగ్రెస్‌) తన ఆస్తుల విలువ రూ.606+ కోట్లుగా ప్రకటించి ప్రథమ స్థానంలో నిలిచారు.

రూ.458+ కోట్లతో మునుగోడు కాంగ్రెస్‌ ఎమ్మె ల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌ రెడ్డి, రూ.433+ కోట్లతో పాలే రు కాంగ్రెస్‌ ఎమ్మెల్యే పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి ఆ తర్వాతి స్థానాల్లో ఉన్నారు. మాజీ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌ రావు రూ.58+ కోట్లు, సిరిసిల్ల బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే కె.తార క రామారావు రూ.53+ కోట్లు, సీఎల్పీ నాయకుడు, టీపీసీ సీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి రూ.30+ కోట్ల ఆస్తులు ప్రకటించారు.

రూ.24+ లక్షలతో ఖానాపూర్‌ కాంగ్రెస్‌ ఎమ్మెల్యే వె డ్మ బొజ్జు అతి తక్కువ ఆస్తులు ఉన్న ఎమ్మెల్యేగా నిలిచా రు. రూ.28+ లక్షలతో దేవరకొండ కాంగ్రెస్‌ ఎమ్మెల్యే బాలు నాయక్‌ నెనావత్, రూ.56+లక్షలతో అశ్వారావు పేట కాంగ్రెస్‌ ఎమ్మెల్యే ఆదినారాయణలు తదుపరి స్థానా ల్లో ఉన్నారు. 2023లో గెలిచిన అభ్యర్థుల సగటు ఆస్తులు రూ. 38.88 కోట్లు కాగా.. 2018లో గెలిచిన ఎమ్మెల్యేల సగటు ఆస్తులు రూ.15.71 కోట్లు కావడం గమనార్హం.

అప్పుల్లో దానం టాప్‌
మొత్తం 119 మంది ఎమ్మెల్యేల్లో 61 మంది తమకు రూ. కోటి కంటే ఎక్కువ అప్పులు ఉన్నాయని ప్రకటించారు. రూ.49+ కోట్ల అప్పుతో ఖైరతాబాద్‌ బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే దానం నాగేందర్‌ ప్రథమ స్థానంలో నిలిచారు. పాలేరు ఎమ్మెల్యే పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి (రూ.43+ కోట్లు), చెన్నూరు ఎమ్మెల్యే గడ్డం వివేకానంద్‌ (రూ.41+ కోట్లు) తర్వాతి స్థానాల్లో ఉన్నారు. 

96 మంది ఎమ్మెల్యేల వయసు 51 పైనే 
తాజా ఎన్నికల్లో గెలిచిన వారిలో 23 (19%) మంది ఎమ్మెల్యేల వయస్సు 25 నుంచి 50 సంవత్సరాల మధ్య ఉండగా, 96 మంది (81%) ఎమ్మెల్యేలు 51–80 సంవత్సరాల మధ్య వయస్సుతో ఉన్నారు. అత్యంత ఎక్కువ వయస్సు ఉన్న ఎమ్మెల్యేగా బాన్సువాడ నుంచి గెలుపొందిన పోచారం శ్రీనివాస్‌రెడ్డి (74) నిలిచారు. అత్యంత పిన్న వయస్కులైన ఎమ్మెల్యేలుగా పాలకుర్తి నుంచి గెలుపొందిన యశస్విని (26), మెదక్‌ నుంచి గెలిచిన మైనంపల్లి రోహిత్‌ (26) నిలిచారు. కాగా కొత్త అసెంబ్లీలో 109 మంది పురుషులు, 10 మంది మహిళలు ఎమ్మెల్యేలుగా అడుగుపెట్టనున్నారు.  

Videos

పాడి కౌశిక్ రెడ్డికి ఎథిక్స్ కమిటీ నోటీసులు..!

41 ఏళ్లకు జూడో సర్టిఫికెట్.. లోకేష్ స్కాం బట్టబయలు..

పోలీసుల ఓవర్ యాక్షన్.. కల్పలత రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

ఒళ్లు దగ్గర పెట్టుకోండి..! బాబుపై చలసాని సీరియస్

కొండా సురేఖ దారెటు..!

ఇంకా ఎన్నెన్ని బయటపడతాయో? కొండా బర్తరఫ్ పై రామచంద్రరావు రియాక్షన్

పోలవరం అంటే గుర్తొచ్చేది YSR... బాబు క్రెడిట్ చోరీపై ఉండవల్లి సెటైర్లు

బాబు తప్పుడు సమాచారంపై వైఎస్ జగన్ ఫైర్

గోల్డ్ కొనేవారికి షాక్..! భారీగా పెరిగిన ధరలు

కృష్ణుడిగా విజయ్ దేవరకొండ..?

Photos

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)