Breaking News

మహిళా నేతపై వివాదాస్పద వ్యాఖ్యలు.. శివసేన ఎంపీపై కేసు

Published on Fri, 11/01/2024 - 19:45

ముంబై: మహారాష్ట్రలో అసెంబ్లీ ఎన్నికల వేళ కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ఎన్నికల్లో సీట్లు దక్కని నేతలు ఇతర పార్టీలవైపు చూస్తున్నారు. ఈ క్రమంలోనే బీజేపీలో టికెట్‌ దక్కని మహిళా నేత.. షిండే వర్గం శివసేనలో చేరడంతో యూబీటీ ఎంపీ సంచలన కామెంట్స్‌ చేశారు. దిగుమతి చేసుకున్న వస్తువులను ప్రజలు అంగీకరించరు అని కామెంట్స్‌ చేయడం వివాదం తెచ్చిపెట్టింది.

మహారాష్ట్రలో అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో బీజేపీ నుంచి షాయినా ఎన్‌సీ టికెట్‌ ఆశించారు. అయితే, ఆమెకు టికెట్‌ దక్కకపోవడంతో తాజాగా బీజేపీని వీడి షిండే వర్గం శివసేనలో చేరారు. ఆమె చేరికపై శివసేన(యూబీటీ) నేత, ఎంపీ అరవింద్‌ సావంత్‌ స్పందించారు. ఈ సందర్భంగా సావంత్‌ మాట్లాడుతూ.. షాయినా ఎన్‌సీ ఇంతకాలం బీజేపీలో ఉన్నారు. ఎన్నికల సమయంలో ఆమెకు టికెట్‌ రాలేదని ఇప్పుడు మా పార్టీలో చేరారు. దిగుమతి చేసుకున్న వస్తువులను ప్రజలు అంగీకరించరు(దిగుమతి చేసుకున్న మెటీరియల్). మా వస్తువులు ఒరిజినల్‌ అంటూ కామెంట్స్‌ చేశారు. దీంతో, మహిళా నేతను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి.

ఇక, ఎంపీ సావంత్‌ వ్యాఖ్యలపై మహిళా నేత షాయినా స్పందించారు. తాజాగా ఆమె మాట్లాడుతూ.. అరవింద్‌ సావంత్‌ వ్యాఖ్యలు బాధాకరం. ఆయన గతంలో నన్ను ఎన్నికల ప్రచారానికి తీసుకెళ్లారు. ఇప్పుడేమో దిగుమతి చేసుకున్న మెటీరియల్‌ అంటున్నారు. నేను మెటీరియల్‌ను కాదు. దీనిపై నేను పోలీసులకు ఫిర్యాదు చేస్తాను. ఇది సావంత్‌తో పాటు ఆయన పార్టీ మైండ్‌సెట్‌ను చూపిస్తోంది. ఆయనకు మహిళల పట్ల గౌరవం లేదు అంటూ మండిపడ్డారు. ఆ తర్వాత ఆమె తమ మద్దతుదారులతో కలిసి పోలీసు స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేశారు. దీంతో, పోలీసులు కేసు నమోదు చేశారు. మరోవైపు.. సావంత్‌ వ్యాఖ్యలను బీజేపీ సైతం తీవ్రంగా ఖండించింది. 

Videos

మా కార్యకర్తలను చంపడానికా ఈ ఎలక్షన్ లు పెట్టారు.. SECని నిలదీసిన YSRCP నేతలు

టీడీపీ గూండాల దాడిపై వైఎస్ జగన్ ప్రెస్ మీట్

నామినేషన్లపై పెద్దిరెడ్డి సంచలన కామెంట్స్

దాండియా వేడుకల్లో విషాదం.. విద్యార్థిని మృతి, పలువురికి గాయాలు

ముళ్ల కంచెలతో దిగ్బంధం.. పోలీస్ Vs వైఎస్ఆర్ సీపీ

ఏపీలో రాష్ట్రపతి పాలన?

కోల్ కతాలో దుర్గా పూజ వేడుకల్లో తీవ్ర విషాదం.. 19 మంది దుర్మరణం

YS అవినాష్ రెడ్డిపై టీడీపీ గూండాల హత్యాయత్నం

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)