Breaking News

‘ఇన్ఫోసిస్‌ సేనాపతి’పై ఎస్సీ-ఎస్టీ అట్రాసిటీ కేసు

Published on Tue, 01/28/2025 - 08:58

బెంగళూరు: ఇన్ఫోసిస్‌ సహ వ్యవస్థాపకుడు సేనాపతి క్రిస్‌ గోపాలకృష్ణన్‌ పై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు అయ్యింది.  ఇండియన్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ సైన్స్‌(Indian Institute of Science)లో ఓ ప్రొఫెసర్‌ విషయంలో హనీట్రాప్‌కు పాల్పడ్డారన్న ఆరోపణలతో ఈ పరిణామం చోటు చేసుకుంది.

గతంలో.. సంచలన అభియోగాల మీద ప్రొఫెసర్‌గా పని చేసిన దుర్గప్పను ఐఐఎస్సీ(IISc) విధుల నుంచి తొలగించింది. అయితే.. సేనాపతి క్రిష్‌ గోపాలకృష్ణన్‌(Senapathy Kris Gopalakrishnan)తో పాటు మాజీ ఐఐఎస్సీ డైరెక్టర్‌ బలరాం సహా మరికొందరు తనపై కుట్ర చేశారని, హనీట్రాప్‌ కేసులో ఇరికించారని దుర్గప్ప ఆరోపిస్తున్నారు. అంతేకాదు కులం పేరుతో తనను దూషించి బెదిరింపులకు పాల్పడ్డారని ఫిర్యాదులో పేర్కొన్నారు.  ఈ మేరకు..

సోమవారం కోర్టును ఆశ్రయించారు. దీంతో.. మొత్తం 18 మందిపై కేసు నమోదు చేయాలని పోలీసులకు 71వ సిటీ సివిల్‌ అండ్‌ సెషన్‌ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. దీంతో.. బెంగళూరు సదాశివనగర్‌ పోలీస్‌ స్టేషన్‌లో కేసు నమోదయ్యింది. ఈ ఆరోపణలపై ఇటు గోపాలకృష్ణన్‌కానీ, అటు ఐఐఎస్ బోర్డుకానీ స్పందించలేదు. ప్రస్తుతం గోపాలకృష్ణన్‌ బోర్డులో సభ్యుడిగా కూడా ఉన్నారు.

1981, జులై 2వ తేదీన ఇన్ఫోసిస్‌ ప్రారంభమైన సంగతి తెలిసిందే. నారాయణమూర్తితో పాటు సేనాపతి క్రిష్‌ గోపాలకృష్ణన్‌, మరో ఐదుగురు కలిసి ఈ కంపెనీని పుణే(మహారాష్ట్ర)లో తొలుత ప్రారంభించారు.

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)