Breaking News

ఉదయనిధి, ప్రియాంక ఖర్గేలపై కేసు

Published on Wed, 09/06/2023 - 13:05

లక్నో:మతపరంగా ఓ వర్గం ప్రజలను కించపరుస్తున్నారనే ఆరోపణలపై ఉదయనిధి స్టాలిన్, కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే కుమారుడు ప్రియాంక ఖర్గేపై యూపీ పోలీసులు కేసు నమోదు చేశారు. ఉద్దేశపూర్వకంగానే మతపరంగా రెచ్చగొట్టేలా వ్యాఖ్యలు చేశారనే ఆరోపణలతో పోలీసులు సెక్షన్ 295ఏ కింద ఎఫ్‌ఐఆర్ నమోదు చేసినట్లు స్పష్టం చేశారు.

ఉదయనిధి స్టాలిన్, ప్రియాంక ఖర్గేలపై న్యాయవాదులు హర్ష గుప్తా, రామ్‌ సింగ్ లోధిలు ఉత్తరప్రదేశ్‌లోని రామ్‌పూర్‌ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. మీడియా కథనాలను ఆధారాలుగా చూపుతూ మతపరమైన భావాలను కించపరుస్తున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. 

సనాతన ధర్మంపై వివాదాస్పద వ్యాఖ్యలు..
సనాతన ధర్మంపై డీఎంకే నాయకుడు ఉదయనిధి స్టాలిన్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. సనాతన ధర్మాన్ని డెంగ్యూ మలేరియా, కరోనా వంటి రోగాలతో పోల్చారు. దానిని వ్యతిరేకించడం కాదు.. పూర్తిగా నిర్మూలించాలని అన్నారు. ఈ పరిణామాల అనంతరం కర్ణాటక నేత, కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే కుమారుడు ప్రియాంక ఖర్గే కూడా ఇలాంటి వ్యాఖ్యలే చేశారు. దీనిపై సనాతనీయుల మారణహోమానికి పిలుపునిస్తున్నారని బీజేపీ ఆరోపించడంతో దేశస్థాయిలో పెద్ద ఎత్తున రాజకీయ దుమారం రేగింది. 

ఇదీ చదవండి: అక్కడ సనాతన దినోత్సవంగా సెప్టెంబర్ 3

Videos

లోకల్ వార్ రెండో దశ మొదలు

ఘోర రోడ్డు ప్రమాదం..ఎగిరిబడ్డ వ్యక్తి

YSRCP MPTC అభ్యర్థిపై దాడి పోలీస్ స్టేషన్ కు YS అవినాష్ రెడ్డి

Ramchandrapuram : కూటమిని చిత్తుచిత్తుగా ఓడిస్తాం

నామినేషన్ పత్రాలు చించేసిన TDP గూండాలు అక్కడ ఎన్నిక వాయిదా

Kurnool: YSRCP మహిళలపై TDP మహిళలు దాడి

ఖాకీ చొక్కాల మాటున టీడీపీ గూండాలు.. ఎన్నికలు జరిగితే 100% YSRCPదే గెలుపు..

70MMలో చంద్రముఖి బాబు నిజస్వరూపం

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Photos

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)