Breaking News

పైలట్‌ సుమీత్ సభర్వాల్‌ అంత్యక్రియలు పూర్తి

Published on Tue, 06/17/2025 - 12:21

ముంబై: ఎయిర్‌ ఇండియా విమాన ప్రమాదంలో కన్నుమూసిన పైలట్‌ సుమీత్ సభర్వాల్ మృతదేహాన్ని ముంబైలోని అతని స్వగృహానికి తరలించారు. పోవైలోగల జల్ వాయు విహార్‌కు మంగళవారం ఉదయం అతని మృతదేహం చేరుకోగానే, అక్కడ గంభీరమైన నిశ్శబ్ద వాతావరణం అలముకుంది. గత వారం అహ్మదాబాద్‌లో జరిగిన ఫ్లైట్ ఏI-171 ప్రమాదంలో ఎయిర్ ఇండియా పైలట్‌ సుమీత్ సభర్వాల్  ప్రాణాలు కోల్పోయారు.

పైలట్‌ సుమీత్ సభర్వాల్‌కు అంతిమ వీడ్కోలు పలికేందుకు అతని కుటుంబ సభ్యులు, స్నేహితులు, సహచరులు అతని ఇంటికి చేరుకున్నారు. సుమీత్‌ మృతదేహానికి అతని తండ్రి అంత్యక్రియలు నిర్వహించారు. 55 ఏళ్ల కెప్టెన్ సభర్వాల్ అనారోగ్యంతో ఉన్న తన తండ్రిని చూసుకునేందుకు ముందుగానే పదవీ విరమణ చేయాలని అనుకున్నారు. కానీ అంతలోనే ఘోరం జరిగిపోయింది.

చిన్నప్పటి నుంచి సభర్వాల్‌ను తెలిసిన పొరుగువారు మాట్లాడుతూ ‘సబర్వాల్‌ కుటుంబం దశాబ్దాలుగా ఇక్కడేవుంటోంది. సబర్వాల్‌ ఎంతో ధైర్యవంతుడు. విమానం ప్రమాదంలో పడిన సమయంలో అతను విమానంలోని ప్రయాణికులను కాపాడేందుకు చివరి క్షణం వరకు ప్రయత్నించి ఉంటారు. వారి కుటుంబానికి ఇది తీరని నష్టం. సబర్వాల్‌ అందరి మనసుల్లో ఎప్పటికీ నిలిచి వుంటారు’ అని అన్నారు.

ఇది కూడా చదవండి: Himachal: 200 అడుగుల లోయలో పడిన బస్సు.. ఇద్దరు మృతి

Videos

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Nellore: అధికారుల ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన చంద్రశేఖర్ రెడ్డి

అడ్డుకోవాలని చూసారు పోలీసులకు ఇచ్చిపడేసిన రోజా

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రేష్మ నామినేషన్ తిరస్కరణ...

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

Photos

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)