Breaking News

కెనడా ‘సైబర్‌ ముప్పు’ జాబితాలో భారత్‌

Published on Sun, 11/03/2024 - 06:14

ఒట్టావా/న్యూఢిల్లీ:  ఇండియా విషయంలో కెనడా ప్రభుత్వం దుందుడుకు చర్యలకు పాల్పడుతోంది. ఇండియా నుంచి తమకు సైబర్‌ ముప్పు పొంచి ఉందని పేర్కొంది. ఏయే దేశాల నుంచి సైబర్‌ ముప్పు ఉందన్నదానిపై గత నెల 30న కెనడియన్‌ సెంటర్‌ ఫర్‌ సైబర్‌ సెక్యూరిటీ(సైబర్‌ సెంటర్‌) ఓ జాబితా విడుదల చేసింది. ఇందులో ఇండియాను సైతం చేర్చింది. నేషనల్‌ సైబర్‌ థ్రెట్‌ అసెస్‌మెంట్‌(ఎన్‌సీటీఏ) 2025–26లో చైనా, రష్యా, ఇరాన్, ఉత్తర కొరియా తర్వాత ఇండియా పేరును చేర్చడం గమనార్హం. 

భారత ప్రభుత్వం నియమించిన వ్యక్తులు గూఢచర్యం కోసం తమ ప్రభుత్వ నెట్‌వర్క్‌పై సైబర్‌ ముప్పు కార్యకలాపాలకు పాల్పడే ప్రమాదం ఉందని కెనడా ప్రభుత్వం ఆరోపించింది. ఎన్‌సీటీఏ జాబితాను ప్రతి రెండేళ్లకోసారి విడుదల చేస్తుంటారు. 2018, 2020, 2023–24 నాటి జాబితాలో ఇండియా పేరులేదు. తొలిసారిగా 2025–26 జాబితాలో ఇండియా పేరు చేర్చారు. ఇదిలా ఉండగా, భారత్‌ నుంచి సైబర్‌ ముప్పు పొంచి ఉందంటూ కెనడా విడుదల చేసిన జాబితాపై భారత విదేశాంగ శాఖ అధికారి రణ«దీర్‌ జైస్వాల్‌ శనివారం అభ్యంతరం వ్యక్తం చేశారు. ప్రపంచ దేశాల అభిప్రాయాన్ని భారత్‌కు వ్యతిరేకంగా మా ర్చాలన్నదే కెనడా కుట్ర అని ఆరోపించారు. 

Videos

జగనన్న నాపై పెట్టిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటా

మా మిథున్ రెడ్డిని చంపేస్తారా? TDP గూండాల దాడిపై పెద్దిరెడ్డి రియాక్షన్..

రాష్టపతి దృష్టికి ఎంపీ మిథున్ రెడ్డి పై దాడి ఘటన

గంభీర్ మాస్టర్ ప్లాన్ .. వన్డేల నుండి బుమ్రా అవుట్?

నామినేషన్ కు ర్యాలీగా YS అవినాష్ రెడ్డి

మిథున్ రెడ్డికి జగన్ పరామర్శ TDP దాడులపై రియాక్షన్

LIVE : టీడీపీ గూండాల దాడులపై మిథున్ రెడ్డి సంచలన Press Meet

ఎన్నికల్లోనూ రెడ్ బుక్ రాజ్యాంగం.. మిథున్ రెడ్డిపై హత్యాయత్నం రోజా రియాక్షన్

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)