Breaking News

పుణె, థానే, బెంగళూరు మెట్రో రైలు ప్రాజెక్టులకు కేబినెట్‌ ఆమోదం

Published on Sat, 08/17/2024 - 06:16

న్యూఢిల్లీ: ఎన్నికలు జరగనున్న మహారాష్ట్రలో పుణే, థానే, కర్ణాటక రాజధాని బెంగళూరులో మెట్రో రైలు ప్రాజెక్టుల పొడగింపునకు కేంద్ర మంత్రివర్గం శుక్రవారం ఆమోదముద్ర వేసింది. ప్రధాని నేతృత్వంలో జరిగిన కేబినెట్‌ భేటీలో బెంగళూరు మెట్రో రైలు ప్రాజెక్టు ఫేజ్‌–3లో రెండు కొత్త కారిడార్ల నిర్మాణానికి ఆమోదం తెలిపినట్లు రైల్వేశాఖ మంత్రి అశ్విని వైష్ణవ్‌ వెల్లడించారు. 

44.65 కిలోమీటర్ల పొడవైన ఈ రెండు ఎలివేటెడ్‌ కారిడార్లలో మొత్తం 31 సేష్టన్లు ఉంటాయని ప్రభుత్వం వెల్లడించింది. జేపీ నగర్‌– కెంపపురా, హోషహళ్లి– కడబగెరే కారిడార్ల నిర్మాణానికి రూ.15,611 కోట్ల ఖర్చు కానుంది. బెంగళూరు పశి్చమ ప్రాంతాన్ని ఈ మెట్రోరైలు ప్రాజెక్టు మెరుగ్గా అనుసంధానిస్తుందని కేంద్రం పేర్కొంది. పుణె మెట్రో ఫేజ్‌–1లో స్వరగేట్‌– కాట్రాజ్‌ భూగర్భ రైల్వే లైన్‌ పొడిగింపునకు కేంద్ర కేబినెట్‌ పచ్చజెండా ఊపింది. 

పుణే శివార్లలో కనెక్టివిటీని పెంచే ఈ లైన్‌–1బి పొడిగింపు ప్రాజెక్టు వ్యయం రూ.2,954 కోట్లని, కేంద్ర, మహారాష్ట్ర ప్రభుత్వాలు ఖర్చును సమంగా భరిస్తాయని తెలిపింది. థానే పశి్చమ ప్రాంతాన్ని కలుపుతూ వెళ్లే.. థానే ఇంటెగ్రల్‌ రింగ్‌ మెట్రో రైల్‌ ప్రాజెక్టు కారిడార్‌కు కూడా కేంద్ర కేబినెట్‌ ఆమోదం తెలిపింది.  ఈ కారిడార్‌లో 22 స్టేషన్లు ఉంటాయి. మొత్తం ప్రాజెక్టు వ్యయం రూ. 12,200 కోట్లను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సమంగా భరిస్తాయని వెల్లడించింది.  

రెండు విమానాశ్రయాల విస్తరణ 
మౌలిక సదుపాయాల అభివృద్ధిని కొనసాగిస్తూ కేంద్ర కేబినెట్‌ శుక్రవారం రెండు విమానాశ్రయ విస్తరణ ప్రాజెక్టులకు అనుమతి మంజూరు చేసింది. పశి్చమబెంగాల్‌లోని బగ్డోగ్రా విమానాశ్రయంలో రూ. 1,549 కోట్లతో పలు నిర్మాణాలు చేపట్టనున్నారు. బిహార్‌లోని బిహ్తా విమానాశ్రయాన్ని రూ. 1,413 కోట్లతో విస్తరించనున్నారు.   
 

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)