Breaking News

రూ.1,500 కోట్లతో ఇన్సెంటివ్‌ స్కీమ్‌ 

Published on Thu, 09/04/2025 - 05:19

న్యూఢిల్లీ: దేశంలో అరుదైన ఖనిజాల రీసైక్లింగ్‌ ప్రక్రియను ప్రోత్సహించడానికి కేంద్ర ప్రభుత్వం రూ.1,500 కోట్లతో ఇన్సెంటివ్‌ స్కీమ్‌ను అమల్లోకి తీసుకురాబోతోంది. బుధవారం కేంద్ర మంత్రివర్గ సమావేశంలో దీనికి అమోదముద్ర వేశారు. అరుదైన ఖనిజాల రీసైక్లింగ్‌ సామర్థ్యాన్ని మరింత పెంచబోతున్నట్లు ప్రభుత్వం ఒక ప్రకటనలో వెల్లడించింది. 

ప్రతిఏటా 270 కిలో టన్నుల రిసైక్లింగ్‌ సామర్థ్యాన్ని అభివృద్ధి చేసుకోవాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. దీనివల్ల ఏటా 40 కిలో టన్నుల అరుదైన ఖనిజాల ఉత్పత్తి జరుగుతుంది. ప్రత్యక్షంగా, పరోక్షంగా 70 వేల మందికి ఉపాధి లభిస్తుందని ప్రభుత్వం అంచనా వేస్తోంది. నేషనల్‌ క్రిటికల్‌ మినరల్‌ మిషన్‌లో భాగంగా ఇన్సెంటివ్‌ స్కీమ్‌ను తీసుకురాబోతున్నారు. ఏడేళ్లలో రూ. 34,300 కోట్లతో నేషనల్‌ క్రిటికల్‌ మినరల్‌ మిషన్‌ను అమలు చేయబోతున్నట్లు గతంలోనే ప్రభుత్వం ప్రకటించింది. కాపర్, లిథియం, నికెట్, కోబాల్ట్‌ సహా రేర్‌ఎర్త్‌ ఖనిజాల రీసైక్లింగ్‌కు ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తోంది. 

ప్రధాని మోదీ హర్షం 
కేబినెట్‌లో ఆమోదించిన ఇన్సెంటివ్‌ పథకం పట్ల ప్రధాని నరేంద్ర మోదీ హర్షం వ్యక్తంచేశారు. దీనివల్ల అరుదైన ఖనిజాల రీసైక్లింగ్‌కు మరింత ప్రోత్సాహం లభిస్తుందన్నారు. బ్యాటరీ వ్యర్థాలు, ఈ–వ్యర్థాల రీసైక్లింగ్‌ సామర్థ్యం పెరుగుతుందని, ఎంతోమందికి ఉద్యోగాలు, ఉపాధి అవకాశాలు లభిస్తాయని వెల్లడించారు. ఈ మేరకు ‘ఎక్స్‌’లో పోస్టుచేశారు.   
 

Videos

అవినాష్ పై AK-47తో ఫైరింగ్ చేయిస్తావా..? ఏ ఒక్కడినీ వదిలిపెట్టాను..!

గొడవలకు గొడ్డళ్లు సప్లై చేస్తున్నాడు.. చంద్రబాబుపై జగన్ సీరియస్!

లోకేష్ కు బుర్ర పనిచేయడం లేదు..! మిథున్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

బాబుకు హైకోర్టు షాక్.. బండి దీప్తి సంచలన కామెంట్స్

ఎమ్మెల్యే మాధవిరెడ్డి భర్త ఛాలెంజ్.. ఇచ్చిపడేసిన కడప YSRCP నేతలు

ఈ రోజు కరకట్టలో కూర్చొని ముసిముసి నవ్వులు నవ్వొచ్చు.. రేపు అనేది మీ ఊహకే వదిలేస్తున్నాం

మా కార్యకర్తలను చంపడానికా ఈ ఎలక్షన్ లు పెట్టారు.. SECని నిలదీసిన YSRCP నేతలు

టీడీపీ గూండాల దాడిపై వైఎస్ జగన్ ప్రెస్ మీట్

నామినేషన్లపై పెద్దిరెడ్డి సంచలన కామెంట్స్

దాండియా వేడుకల్లో విషాదం.. విద్యార్థిని మృతి, పలువురికి గాయాలు

Photos

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)