Breaking News

డీఏ, డీఆర్ పెంపు.. కేంద్ర క‍్యాబినెట్ కీలక నిర్ణయాలు

Published on Wed, 10/28/2026 - 15:40

ఢిల్లీ: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలో బుధవారం కేంద్ర క‍్యాబినెట్ సమావేశం జరిగింది. ఇందులో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఇందుకు సంబంధించిన వివరాలను కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్‌ మీడియాకు తెలిపారు. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు 3% డీఏ, డీఆర్ పెంపునకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. 1.16 కోట్ల మందికి పైగా ఉద్యోగులు, పెన్షనర్లకు 2026 జులై 1 నుంచి ఈ పెంపు వర్తించనుంది.

దీంతో ఇప్పటివరకు 60 శాతంగా ఉన్న డీఏ 63 శాతానికి చేరింది. ప్రతి 6 నెలలకు ఒకసారి చేసే సవరణలో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నారు. దీపావళి వేడుకలకు ముందు ఈ నిర్ణయం తీసుకున్నారు. 2026 జులై విడత డీఏ పెంపుపై కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లు దేశవ్యాప్తంగా ఎంతోకాలంగా ఎదురుచూస్తున్నారు. పారిశ్రామిక కార్మికుల వినియోగదారుల ధరల సూచీ (ఏఐసీపీఐ–ఐడబ్ల్యూ) 12 నెలల సగటు ఆధారంగా డీఏ సవరణలు చేపడతారు. 

ఈ సూచీ ఆధారంగా డీఏ పెంపును లెక్కిస్తారు. 2026 జులై విడత సవరణకు అవసరమైన 12 నెలల సూచీ గణాంకాలు ఇప్పటికే పూర్తయ్యాయి. వాటి ఆధారంగా తదుపరి 6 నెలల డీఏ లేదా డీఆర్‌ను 3 శాతం పెంచుతారని అంచనా వేశారు. దీంతో డీఏ 60 శాతం నుంచి 63 శాతానికి పెరిగింది.

ఈ పెంపుతో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల నెలవారీ ఆదాయం పెరుగుతుంది. ఉదాహరణకు, రూ.18,000 మూల వేతనం ఉన్న ఉద్యోగికి నెలకు అదనంగా రూ.540 లభిస్తుంది. రూ.29,200 మూల వేతనం ఉన్న ఉద్యోగికి నెలకు రూ.876 అదనంగా అందుతుంది.

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్ 3శాతం DA పెంపు

కేంద్ర క్యాబినెట్‌ ఇతర నిర్ణయాలు

  • కంటైనర్ తయారీ రంగాన్ని ప్రోత్సహించేందుకు రూ.10,000 కోట్లతో ప్రత్యేక పథకం.

  • క్రీడా వస్తువుల తయారీ రంగ అభివృద్ధికి ‘ఖేలో ఇండియా స్పోర్ట్స్ గూడ్స్ మాన్యుఫ్యాక్చరింగ్ స్కీమ్’కు రూ.1,856 కోట్లు కేటాయింపు.

  • డీఏ (కరవు భత్యం), డీఆర్ (కరవు సహాయ భత్యం) కోసం రూ.10,016 కోట్ల కేటాయింపు.

  • కేంద్ర కేబినెట్ ప్రకటించిన నాలుగు నిర్ణయాలకు కలిపి మొత్తం రూ.29,267 కోట్ల కేటాయింపు.

  • ప్రధానమంత్రి వికసిత్ గ్రామ స్వరాజ్ యోజనకు రూ.7,395 కోట్ల కేటాయింపునకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది.

ఇదీ చదవండి: గ్లోబల్‌ మార్కెట్లన్నీ తుక్కు తుక్కు అయిపోతాయ్‌: ఇరాన్‌ వార్నింగ్‌

Videos

చంద్రబబు డైవర్షన్ పాలిటిక్స్ పై.. పుత్తా శివశంకర్ స్ట్రాంగ్ కౌంటర్

చెవిరెడ్డి పరామర్శ

ప్రజలకు ప్రభుత్వం భారీ శుభవార్త.. తగ్గనున్న బియ్యం ధరలు..?

Ambati : అది ఆయన పర్సనల్.. నేను చెప్పాలనుకున్నది ఒక్కటే!

కళ్యాణదుర్గంలో YSRCP భారీ ర్యాలీ

MPP పదవి కోసం YSRCP MPTC పట్టాభిరామిరెడ్డి కిడ్నాప్

SBI సూపర్ స్కీమ్ ప్రతి నెలా రూ.60,000

బాక్సాఫీస్ ను షేక్ చేస్తున్న గాడ్జిల్లా! ఓవర్సీస్ లో రామాయణ కు గట్టి పోటీ

YSRCP ఎమ్మెల్సీల పిటిషన్లపై నేడు హై కోర్ట్ లో విచారణ

Alert: హైదరాబాద్ కు నీటి గండం.. డిసెంబర్ నుంచి తీవ్ర కష్టాలు..

Photos

+5

కుటుంబంతో కలిసి న‌భా న‌టేష్ దీపావ‌ళి సెలబ్రేషన్స్ (ఫోటోలు)

+5

ఇంట్లోనే చాలా సింపుల్‌గా శ్రీలీల సెలబ్రేషన్ (ఫొటోలు)

+5

దీపావళి స్పెషల్.. అక్కినేని కుటుంబమంతా ఒకేచోట (ఫొటోలు)

+5

అల్లు ఫ్యామిలీ దీపావళి సెలబ్రేషన్ (ఫొటోలు)

+5

#Diwali2026 స్పెషల్ ఫొటోలు షేర్ చేసిన కృతి శెట్టి..(ఫోటోలు)

+5

ప్రమాదకర స్థాయికి వాయు కాలుష్యం...ఢిల్లీ ఉక్కిరి బిక్కిరి (ఫోటోలు)

+5

‘ఇట్లు అర్జున’ సినిమా మ్యూజికల్‌ లైవ్‌ కన్సర్ట్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

ఖైరతాబాద్‌లో ఘనంగా సదర్ ఉత్సవాలు (ఫోటోలు)

+5

రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ స్టన్నింగ్‌ ఫోటోలు

+5

దివాళీ వేళ మెరిసిన తారలు (ఫోటోలు)