Breaking News

‘జరూసలేం’గా మారిన ‘ఇజ్రాయెల్‌ ట్రావెల్స్‌’

Published on Sun, 10/06/2024 - 12:14

మంగళూరు: ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య జరుగున్న యుద్ధం రోజురోజుకూ మరింత ముదురుతోంది. ఇటీవల కొందరు పాలస్తీనాకు మద్దతుగా ఊరేగింపు చేపట్టి, తమ నిరసనను వ్యక్తం చేశారు. కర్నాటకలోని మంగుళూరులో కూడా ఇలాంటి ఘటనే చోటుచేసుకుంది.

కర్నాటకలోని మూడ్‌బిద్రి-కిన్నిగోలి-కటీల్-ముల్కి మధ్య నడుస్తున్న ‘ఇజ్రాయెల్ ట్రావెల్స్' పేరుతో ఒక ప్రైవేట్‌ బస్సును లెస్టర్ కటీల్‌ అనే వ్యక్తి నడుపుతున్నాడు. 12 ఏళ్లపాటు ఆయన తన కుటుంబంతో కలిసి ఇజ్రాయెల్‌లో  ఉన్నాడు. ఇటీవలే ఇక్కడికి వచ్చిన ఆయన మంగళూరులో ఒక పాత బస్సును కొనుగోలు చేసి, ముల్కి మూడ్‌బిద్రి మార్గంలో నడుపుతున్నాడు. ఆయన ఇజ్రాయెల్ పై తనకున్న ప్రేమను తెలియజేసేందుకు ఆ బస్సుకు 'ఇజ్రాయెల్ ట్రావెల్స్' అనే పేరు పెట్టాడు. కటీల్‌లో నివాసముంటున్న లెస్టర్ కుటుంబం ఆ బస్సు నిర్వహణను చూసుకుంటోంది. కాగా 'ఇజ్రాయెల్' పేరుతో ఉన్న ఆ బస్సును చూసి పాలస్తీనా మద్దతుదారులు ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఇజ్రాయెల్.. పాలస్తీనాపై యుద్ధం చేస్తున్న ఉగ్రవాద దేశమని, అలాంటప్పుడు మంగళూరులో ఆ బస్సుకు ఇజ్రాయెల్‌ పేరు ఎందుకు పెట్టారని వారు ప్రశ్నిస్తున్నారు. బస్సు ఫోటోను సోషల్ మీడియాలో షేర్ చేసి, ట్రోల్ చేయడమే కాకుండా, ఈ వ్యవహారంపై పోలీసులు ఎఫ్‌ఐఆర్ నమోదు చేయాలని డిమాండ్ చేశారు. దీంతో ట్రాఫిక్ పోలీసులు కూడా బస్సు పేరు మార్చాలని యజమానికి సూచించారు. దీంతో బస్సు పేరును‘జెరూసలేం ట్రావెల్స్'గా మార్చారు. 

ఇది కూడా చదవండి: ల్యాండవుతున్న విమానంలో మంటలు

#

Tags : 1

Videos

బాలిక ఎక్కడుంది..? 80 రోజులైనా ఆచూకీ లేదు పోలీసుల తీరుపై హైకోర్టు ఫైర్

ఉద్యోగుల ఆగ్రహం.. బాబుకు షాక్..! మా డబ్బులు మాకు ఇవ్వండి

బంగారం కొనేవాళ్లకు ఇది గుడ్ న్యూస్.. GOLD రేట్లు ఇంకా తగ్గుతాయా?

సీఎం రేవంత్ మార్పు ఖాయం? BRS రాకేష్ కుమార్ షాకింగ్ కామెంట్స్

గుంటూరు పెదకాకానిలో హై టెన్షన్

జనసేన MLAపై బాబు సీరియస్

స్మృతి మందాన రికార్డు సెంచరీ.. సెమిస్ లో భారత్

24 క్యారెట్ గోల్డ్ కు LOAN ఎందుకు ఇవ్వరు? అసలు కారణం ఇదే

బాహుబలి, RRR రికార్డ్స్ పై కన్నేసిన ఇరుముడి..

నేపాల్ లో మృత్యుఘోష..! 1300కు చేరువలో మృతులు

Photos

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు