Breaking News

ఘోర ప్రమాదం.. అదుపుతప్పి చెరువులోకి దూసుకెళ్లిన బస్సు.. 17 మంది మృతి

Published on Sun, 07/23/2023 - 14:52

బంగ్లాదేశ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. వేగంగా వెళ్తున్న బస్సు అదుపుతప్పి చెరువులోకి దూసుకెళ్లిన ఘటనలో 17 మంది ప్రాణాలు కోల్పోయారు. 35 మందికి పైగా గాయపడ్డారు. డ్రైవర్‌ నిర్లక్ష్యం వల్లే ప్రమాదం జరిగిందని ప్రాణాలతో బయటపడిన ప్రయాణికులు తెలిపారు. మృతుల్లో 7గురు మైనర్లు సహా 5గురు మహిళలు కూడా ఉ‍న్నారు. గలకతి సదర్ జిల్లా పరిధిలో చత్రకాండ ప్రాంతంలో ఈ ఘటన జరిగినట్లు పోలీసులు తెలిపారు. 

బస్సు భండారియా ఉపజిల్లా నుంచి ఫిరోజ్‌పూర్‌కు వెళ్తోంది. ఈ క్రమంలో బస్సు స్థానిక యూనియన్ పరిషత్ కార్యాలయం సమీపంలో ఆటో రిక్షాకు సైడ్ ఇస్తుండగా అదుపుతప్పి చెరువులోకి దూసుకెళ్లింది. 17 మంది అక్కడికక్కడే మృతి చెందారు. 35 మంది తీవ్రంగా గాయపడ్డారు.

క్షతగాత్రులను ఝలకతి జిల్లా ఆస్పత్రికి తరలించారు. బస్సులో 60-70 మంది ప్రయాణికులు ఉండటం మృతుల సంఖ్య పెరగడానికి కారణమైనట్లు తెలుస్తోంది. డ్రైవర్ వేగంగా బస్సును నడపడమే ప్రమాదానికి కారణమని స్థానికులు తెలిపారు.  

ఇదీ చదవండి: విమానంలో టాయిలెట్ వాడొద్దన్న సిబ్బంది.. రెండు గంటలు అలాగే..  


 

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)