Breaking News

ఢిల్లీ పేలుడు: ఈ కష్టం పగవాడికి కూడా.. కండక్టర్‌ విషాదాంతం

Published on Tue, 11/11/2025 - 11:35

న్యూఢిల్లీ: ఢిల్లీలోని ఎర్రకోట సమీపంలో జరిగిన కారు పేలుడులో ప్రాణాలు కోల్పోయిన తొమ్మిది మందిలో అశోక్ కుమార్ ఒకరు. ఉత్తరప్రదేశ్‌లోని అమ్రోహాకు చెందిన అశోక్ తన రెక్కల కష్టంతో ఎనిమిది మంది కుటుంబ సభ్యులను పోషిస్తున్నాడు. ఢిల్లీ ట్రాన్స్‌పోర్ట్ కార్పొరేషన్‌లో కండక్టర్‌గా అశోక్‌ పనిచేస్తున్నాడు. పాత ఢిల్లీ మార్గంలో విధులు నిర్వహిస్తుంటాడు.

ఢిల్లీ పేలుడు బాధితుల జాబితాలో తన బంధువు అశోక్ పేరును చూడగానే పప్పు షాక్ అయ్యాడు. ఎల్‌ఎన్‌జేజీ ఆస్పత్రి వెలుపల మీడియాతో ఆయన మాట్లాడుతూ, ‘నేను జాబితాలో అశోక్‌ పేరు  చూశాను. అతను నాకు బంధువు. దీనిని ధృవీకరించడానికి నేను ఫోన్ చేశాను. అశోక్‌ బైక్‌  ఏమయ్యిందో తెలియడం లేదు’ అని అన్నారు. పేలుడు సమయంలో అశోక్ విధుల్లో ఉన్నారా? అని అడగగా, అతను ఈ రూట్‌లోనే విధులు నిర్వహిస్తుంటాడని,  డ్యూటీ లేనప్పుడు కూడా  ఇదే మార్గంలో వెళుతుంటాడని’ తెలిపారు.

అశోక్‌కు భార్య,  నలుగురు పిల్లలు ఉన్నారు. ప్రమాదం జరిగిన ప్రదేశం నుండి  15 కి.మీ దూరంలో ఉన్న జగత్‌పూర్‌లో  కుటుంబంతో పాటు ఉంటున్నాడు. అతని తల్లి సోమవతి పెద్ద కుమారుడు సుభాష్‌తో కలిసి గ్రామంలో ఉంటోంది. సుభాష్ తరచుగా అనారోగ్యంతో  బాధపడుతుండటంతో.. అశోక్  వారి కుటుంబ బాధ్యతలు కూడా మోసేవాడు. పగటిపూట కండక్టర్‌గా, రాత్రి సెక్యూరిటీ గార్డుగా పని చేస్తూ అశోక్‌ కుటుంబాన్ని పోషిస్తూ వస్తున్నాడు.

ఇది కూడా చదవండి: Delhi 10/11 Blast: యూపీ నుంచి వస్తువుల కొనుగోలుకు వచ్చి..

Videos

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Nellore: అధికారుల ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన చంద్రశేఖర్ రెడ్డి

అడ్డుకోవాలని చూసారు పోలీసులకు ఇచ్చిపడేసిన రోజా

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రేష్మ నామినేషన్ తిరస్కరణ...

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

Photos

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)