Breaking News

ఒడిశాలో మావోయిస్టుల ఆయుధ డంప్ స్వాధీనం..  

Published on Tue, 08/08/2023 - 11:22

భువనేశ్వర్: ఒడిశాలోని మల్కన్‌గిరి జిల్లాలో BSF బెటాలియన్ సిబ్బంది నిర్వహించిన సోదాల్లో మావోయిస్టుల భారీ ఆయుధ సామాగ్రి లభ్యమైంది. పక్క సమాచారంతో జరిపిన సోదాల్లో లభ్యమైన ఈ సామాగ్రి మొత్తాన్ని స్వాధీనం చేసుకున్నారు సరిహద్దు భద్రతా దళాలు.  

బెజంగివడ రిజర్వ్ ఫారెస్ట్‌లో మావోయిస్టుల కదలికలపై పక్కా సమాచారం అందడంతో మల్కన్‌గిరి జిల్లాలో BSF బెటాలియన్ సిబ్బంది సోమవారం సెర్చ్ ఆపరేషన్ నిర్వహించింది. ఇందులో భాగంగా మల్కన్ గిరి జిల్లాలోని కలిమెల పోలీస్ పరిధి అమపాదర్-ఎల్కనూర్ గ్రామం, బోడిలుగూడ- బృందమామిడి సమీపంలోని రిజర్వ్ ఫారెస్ట్‌లో జరిపిన సోదాల్లో రాకెట్ లాంచర్‌లతో సహా భారీ ఆయుధాలు, మందుగుండు సామగ్రిని స్వాధీనం చేసుకున్నారు BSF  సిబ్బంది.  

సరిహద్దు భద్రతా దళాల వారు స్వాధీనం చేసుకున్న ఆయుధాల్లో ఒక 303 రైఫిల్, 11 బ్యారెల్ (SBML), 303 రైఫిల్ యొక్క మ్యాగజైన్, 15 మెరుగైన హ్యాండ్ గ్రెనేడ్‌లు, మూడు దేశీయ తుపాకులు, రెండు 51 MM మోర్టార్ బాంబులు, ఒక గ్యాస్ వెల్డింగ్ యంత్రం, 42 లైవ్ కాట్రిడ్జ్‌లు, రాకెట్‌ లాంచర్‌, రెండు బ్రెన్‌ 303 ఎల్‌ఎంజీ స్పేర్‌ బ్యారెల్స్‌, 29 జెలటిన్‌ స్టిక్స్‌, ఐదు అల్యూమినియం నైట్రేట్‌ ప్యాకెట్లు, 30 ఎలక్ట్రిక్‌ డిటోనేటర్లు, తొమ్మిది సింథటిక్‌ వెయిస్ట్‌ బెల్ట్‌లు ఉన్నాయి. 

ఒకప్పుడు ఈ ప్రాంతం మావోయిస్టులకు వారి సానుభూతిపరులకు కంచుకోటగా ఉండేదని, వామపక్ష దళాలు పేలుడు ముడి పదార్థాలను ఇటువంటి రిమోట్ ప్రదేశాలలో ఉంచి అవసరమైనప్పుడు వీటిని ఉపయోగిస్తూ ఉంటారని తెలిపింది BSF సిబ్బంది. ఒక్కసారిగా ఇంత పెద్ద మొత్తంలో ఆయుధ సామగ్రి దొరకడంతో మావోయిస్టుల ఉనికి నిర్ధారణ అయ్యిందని అనుమానిత ప్రాంతాల్లో కూడా సెర్చ్ ఆపరేషన్ నిర్వహించనున్నట్లు తెలిపారు.

ఇది కూడా చదవండి: ఉత్తరాఖండ్‌లో చిక్కుకున్న యాత్రికులు

Videos

Nepal Floods: తల్లి, కుమార్తె వరదలో చిక్కుకున్న దృశ్యాలు.. కన్నీళ్లు తెప్పిస్తున్న వీడియో

నోరు అదుపులో పెట్టుకో.. ఉదయనిధికి సినిమా రేంజ్ లో కౌంటర్

Nandana ఇండియాకు ఎందుకు వచ్చింది? కారణం ఇదేన..!

ఇదేం క్రేజ్ రా అయ్యా ! వైభవ్ కోసం పోటెత్తిన చెపాక్

300 మంది బలి.. ఫస్ట్ రోడ్లు మంచిగా వేయండి డేటా సెంటర్లు కాదు

కంటతడి పెట్టుకున్న సీతక్క, స్పీకర్

బైకర్‌కు తృటిలో తప్పిన ప్రమాదం.. భారీ కొండచరియలు విరిగిపడిన ఘటన వైరల్

లోకేష్ ఇది ఆరంభం మాత్రమే.. DSC అక్రమాలపై YS అవినాష్ రెడ్డి రియాక్షన్

సాక్షితో మెగా ఫేక్ టీచర్ లోకేష్ అక్రమాల పుట్ట బద్దలు

ఎయిర్‌పోర్టులో నందూస్ కపుల్‌ను పట్టుకున్న పోలీసులు!

Photos

+5

అప్సరసగా అందాల రాశీ ..(షూటింగ్‌ ఫొటోస్‌)

+5

తెలంగాణ అసెం‍బ్లీ : బీఆర్‌ఎస్‌ నిరసనపై పోలీసుల ఉక్కుపాదం (ఫొటోలు)

+5

‘రోమాంచకం’ మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టిన గ్లామరస్ యాంకర్ వర్షిణి (ఫొటోలు)

+5

‘మహేంద్రగిరి వారాహి’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

సారీలో సారా.. ధురుంధర్‌ భామ (ఫొటోలు)

+5

పూల మధ్యలో పుత్తడి బొమ్మలా.. అందాల సోయగం శ్రీలీల ఫొటోలు

+5

సద్గురుతో సమంత ఆధ్యాత్మిక ప్రయాణం.. ఫొటోలు

+5

తెలుగు బిగ్‌బాస్‌ సీజన్‌ 10... కంటెస్టెంట్స్‌ వీళ్లే (ఫొటోలు)

+5

ఘనంగా ‘మండాడి’ ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)