Breaking News

కవిత జ్యుడీషియల్‌ కస్టడీ పొడిగింపు

Published on Tue, 05/21/2024 - 06:35

సాక్షి, న్యూఢిల్లీ: ఢిల్లీ లిక్కర్‌ స్కామ్‌ కేసుల్లో బీఆర్‌ ఎస్‌ ఎమ్మెల్సీ కవిత జ్యుడీషియల్‌ కస్టడీని రౌజ్‌ అవెన్యూ కోర్టు పొడిగించింది. సీబీఐ, ఈడీ కేసుల్లో కవిత జ్యుడీషియల్‌ కస్టడీ ముగియడంతో సోమవారం అధికారులు న్యాయమూర్తి కావేరి బవేజా ఎదుట వర్చువల్‌గా హాజరు పరిచారు. దర్యాప్తు కీలక దశలో ఉన్నందున ఆమె కస్టడీ పొడిగించాలని సీబీఐ, ఈడీ తరఫు న్యాయవా దులు పంకజ్‌ గుప్తా, జొహెబ్‌ హొస్సేన్‌లు కోరారు.

కవితతో పాటు మరో నలుగురిపై దాఖ లు చేసిన సప్లిమెంటరీ చార్జిషీటు పరిగణనలోకి తీసుకోవాలన్నారు. దీనిపై కవిత న్యాయవాది నితీష్‌ రాణా అభ్యంతరం తెలిపారు. చార్జిషీటు దాఖలు చేసిన తర్వాత కస్టడీ అవసరం లేదన్నారు. ఇరుపక్షాల వాదనల అనంతరం రెండు కేసుల్లోనూ జూన్‌ 3 వరకు కవిత కస్టడీ పొడిగిస్తూ న్యాయమూర్తి ఆదేశాలు జారీ చేశారు. 

చార్జిషీటుపై ఈడీ వాదనలు: కవితతో పాటు మరో నలుగురిపై ఈడీ దాఖలు చేసిన సప్లి మెంటరీ చార్జిషీటును పరి గణనలోకి తీసుకోవ డంపై దర్యాప్తు సంస్థ ప్రత్యే క కోర్టులో వాదనలు వినిపించింది. న్యాయవాది నవీన్‌ కుమార్‌ మట్టా వాదనలు వినిపిస్తూ.. కవిత, చారియట్‌ ప్రొడ క్షన్స్‌ మీడియా ప్రైవేట్‌ లిమిటెడ్‌ ఉద్యోగులు దామోదర్‌ శర్మ, ప్రిన్స్‌కుమార్, చరణ్‌ప్రీత్‌ సింగ్, ఇండియా ఎహెడ్‌ న్యూస్‌ ఛానల్‌ మాజీ ఉద్యోగి అరవింద్‌ సింగ్‌ల పాత్ర గురించి చార్జిషీటులో ప్రస్తావించినట్లు తెలిపారు. ఈ సమయంలో న్యాయమూర్తి జోక్యం చేసుకుని కవిత కాకుండా మిగిలిన వారి పాత్రపై వాదనలు విన్పించాలని సూచించారు. ఇదే క్రమంలో న్యాయమూర్తి అడి గిన ప్రశ్నలపై సమాధానానికి నవీన్‌ కుమార్‌ సమయం కోరారు. ఈ నేపథ్యంలో పూర్తి వివరా లతో రావాలంటూ న్యాయమూర్తి తదుపరి విచారణను మంగళవారానికి వాయిదా వేశారు.

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)