Breaking News

రాఖీ కడితే ఊరు వదలాల్సివస్తుందట!

Published on Mon, 08/19/2024 - 09:20

దేశ వ్యాప్తంగా ఈరోజు (సోమవారం) రాఖీ వేడుకలు జరుగుతున్నాయి. అయితే ఉత్తరప్రదేశ్‌లోని ఒక గ్రామంలోని ప్రజలు రాఖీ  పండుగ చేసుకోరు. దీని వెనుక వారు ఒక కారణాన్ని చూపుతుంటారు. రాఖీ చేసుకుంటే అన్నదమ్ములు ఊరు వదలాల్సి వస్తుందని వారు చెబుతుంటారు.

యూపీలోని సంభాల్ జిల్లా బేనిపూర్ చక్ గ్రామంలో మచ్చుకైనా రాఖీ వేడుకలు కనిపించవు. రక్షాబంధన్‌ పేరు వినగానే ఇక్కడి ప్రజలు హడలిపోతుంటారు. రాఖీ నాడు తన సోదరి ఏదైనా బహుమతి అడిగితే, సర్వం కోల్పోయి, ఇంటిని విడిచి వెళ్లాల్సి వస్తుందని ఇక్కడి అన్నదమ్ములు భయపడుతుంటారు.

గ్రామ పెద్దలు తెలిపిన వివరాల ప్రకారం.. ఈ ప్రాంతంలో ఒకప్పుడు యాదవులు, ఠాకూర్‌ల ఆధిపత్యం ఉండేదట. నాడు ఇక్కడి జమిందారు ఠాకూర్‌ కుటుంబానికి చెందినవాడు. అయితే అతనికి మగ సంతానమే లేదట. దీంతో ఒకసారి రాఖీ పండుగనాడు యాదవుల ఇంటి ఆడపిల్ల ఆ ఠాకూర్‌కు రాఖీ కట్టి, అతని జమిందారీని కానుకగా అడిగిందట.

ఈ నేపధ్యంలో నాడు యాదవులకు, ఠాకూర్‌లకు వివాదం జరిగిందని చెబుతారు. చివరికి ఆ ఠాకూర్‌ తన జమిందారీని యాదవులకు అప్పగించి, ఊరు విడిచి వెళ్లాల్సి వచ్చిందని స్థానికులు చెబుతుంటారు. నాటి నుంచి ఈ గ్రామంలో ఎవరూ రాఖీ పండుగను చేసుకోకూడదని నిర్ణయించుకున్నారు. అది ఈ నాటికీ గ్రామంలో కొనసాగుతోంది. 

Videos

ప్రొద్దుటూరులో ఉద్రిక్తత పోలీస్ లారీ ఛార్జ్ తిరగబడ్డ YSRCP నేతలు

Rashmika: బతుకమ్మను నెత్తిన పెట్టుకొని... బతుకమ్మ సంబరాలు

కాలేజీలో బిగ్ బాస్ ఓటింగ్.. కేంద్రం సీరియస్ వార్నింగ్...

నామినేషన్లు అడ్డుకోవడంపై... అనిల్ చంద్ర పునేఠా స్ట్రాంగ్ రియాక్షన్

IPL 2027 వేలం డేట్ ఫిక్స్ ? ఎక్కడంటే?

టైగర్ ష్రాఫ్‌ ను కాల్చింది నేనే సంచలన ఆడియో రిలీజ్

కుప్పంలో హైటెన్షన్.. విజయ్ కుమార్ కిడ్నాప్, భరత్ ఇంటిపై దాడి

TDP గూండాలతో కలిసిన పోలీసులు తిరగబడ్డ YSRCP నేతలు

గవర్నర్ కు చెప్పినా నో యూజ్ సుప్రీంకోర్టుకు YSRCP!

రోహిత్ ఆ లాజిక్ ని DECODE చేస్తాడా.? రెచ్చిపోతున్న త్రిగుణ్

Photos

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం.. జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)