Breaking News

హమ్మయ్యా..! అత్యంత ఖరీదైన యుద్ధ విమానం.. గాల్లోకి లేచింది..!

Published on Tue, 07/22/2025 - 11:21

తిరువనంతపురం:  గత నెల 14వ తేదీన కేరళలోని తిరువనంతపురం ఎయిర్‌పోర్ట్‌లో  ఎమర్జెన్సీ ల్యాండింగ్‌ అయిన బ్రిటీష్‌ రాయల్‌ నేవీ యుద్ధ విమానం ఎఫ్‌-35 ఎట్టకేలకు గాల్లోకి ఎగిరింది. 37 రోజుల తర్వాత యుద్ధ విమానం తిరిగి ఇంగ్లండ్‌కు పయనమైంది. తొలుత ఈ యుద్ధ విమానాన్ని తిరిగి మరమ్మత్తులు చేయడం కష్టమని భావించారు. విడిగా పార్ట్‌లు తీసి తీసుకెళ్లాల్సిందేనని నిపుణులులు తేల్చారు. అయితే ఈ యుద్ధ విమానాన్ని తిరిగి పట్టాలక్కెంచేందుకు యూకే నుంచి నిపుణుల్ని తీసుకొచ్చి ఒక ప్రయత్నం చేసి చూశారు. అది సత్ఫలితాల్ని ఇవ్వడంతో ఆ యుద్ధ విమానం తిరిగి గాల్లోకి ఎగిరింది. 

అత్యవసర పరిస్థితులతో కేరళలో దిగిన యూకే యుద్ధ విమానం ఎఫ్‌ 35 ఎపిసోడ్‌ మరమ్మత్తుల విషయంలో యూకే నిపుణులు నానా తంటాలు పడ్డారు. బ్రిటన్‌కు చెందిన ఆధునాతన స్టెల్త్ యుద్ధ విమానం F-35Bను రిపేర్‌ చేసేందుకు 21 మంది ఏవియేషన్ ఇంజనీర్ల బృందం ఈ నెల తొలి వారంలో తిరువనంతపురంలో అడుగుపెట్టారు. 

ఇంజనీర్లు విమానాన్ని తనిఖీ చేసి, అవసరమైన మరమ్మతులు చేసి మళ్లీ గాలిలోకి తీసుకెళ్లే ప్రయత్నం చేశారు. వారి ప్రయత్నం ఫలించడంతో ఆ విమానం విడిభాగాల్ని తొలగించాలనే అంశానికి ఫుల్‌స్టాఫ్‌ పడింది. 

Kerala F-35 Row: No Repair Possible UK Looks At This Final Option

కాగా, బ్రిటన్‌కు చెందిన నౌకాదళ విమాన వాహక నౌక ఆసియా-పసిఫిక్ ప్రాంతంలో మిషన్‌లో పాల్గొంది.  ఆ క్రమంలోనే జూన్‌ 14వ తేదీన ఈ నౌక నుంచి ఎగిరిన ఎఫ్‌ 35 ఫైటర్‌ జెట్‌ మిలిటరీ కార్గో ఎయిర్‌క్రాఫ్ట్‌.. ‍ తిరువంతపురం అంతర్జాతీయ విమానాశ్రయంలో అత్యవసరంగా ల్యాండ్‌ అయ్యింది. తొలుత సాంకేతిక సమస్యగా భావించిన నిపుణులు.. త్వరగతినే ఇది రిపేర్‌ అవుతుందని భావించారు.

అయితే.. ఇంధనం తక్కువగా ఉండడం, ప్రతికూల వాతావరణం కారణంగానే ఇది ల్యాండ్‌ అయ్యిందని తర్వాతే తేలింది. ఈలోపు.. ల్యాండింగ్ అనంతరం హైడ్రాలిక్ స్నాగ్ అనే లోపం తలెత్తడంతో అది గాల్లోకి లేవలేదు. అప్పటి నుంచి CISF సిబ్బంది విమానానికి నిరంతర భద్రత కల్పించారు. అలాగే భారత వైమానిక దళం (IAF) లాజిస్టికల్ సహాయం అందిస్తూ వచ్చింది. తాజాగా ఆ యుద్ధ విమానం గాల్లోకి లేపడానికి చేసిన ప్రయత్నాలు ఫలించడంతో యూకే నిపుణులు ఊపిరి పీల్చుకున్నారు.

అత్యంత ఖరీదైన విమానం..
F-35B స్టెల్త్ యుద్ధ విమానం.. ఫిఫ్త్‌ జనరేషన్‌ స్టెల్త్‌ ఫైటర్‌ జెట్‌.  ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన యుద్ధ విమానాల్లో ఒకటి. ఇది షార్ట్ టేకాఫ్ & వర్టికల్ ల్యాండింగ్ సామర్థ్యం కలిగి ఉంది. ఇలాంటి అత్యాధునికమైన విమానాలను ఇప్పటిదాకా అమెరికా, UK, ఇజ్రాయెల్ వంటి దేశాలే వినియోగిస్తున్నాయి. అమెరికాకు చెందిన సంస్థ Lockheed Martin Corporation F-35B స్టెల్త్ యుద్ధ విమానాలను తయారు చేస్తోంది. 

F-35B (Short Takeoff and Vertical Landing version) ధర సుమారుగా $135.8 మిలియన్ డాలర్లు అంటే దాదాపు ₹1,170 కోట్ల రూపాయలు ఉంటుంది. ఈ విమానంలో ఇంజిన్, ఆయుధ వ్యవస్థలు, స్టెల్త్ టెక్నాలజీ, అధునాతన సెన్సార్‌లు కూడా ఉంటాయి. ఇంజిన్ ఖర్చు మాత్రమే సుమారుగా $19.7 మిలియన్ (₹169 కోట్లు) వరకు ఉంటుంది. ఒక్క గంట ఎగరడానికి సుమారుగా $38,000 (₹32.88 లక్షలు) ఖర్చవుతుంది. F-35B యొక్క వార్షిక నిర్వహణ ఖర్చు సుమారుగా $6.8 మిలియన్ (₹58.8 కోట్లు) ఉంటుంది. అంతెందుకు.. ఈ జెట్‌లో వాడే హెల్మెట్ ధర $400,000 (₹3.4 కోట్లు). అంటే ఒక్క హెల్మెట్‌ ఒక లగ్జరీ కారు ధరతో సమానమన్నమాట. అంతేకాదు.. విమానాన్ని నడిపేందుకు ప్రత్యేక శిక్షణ అవసరం. ఇది కూడా ఖరీదైనదే.

తిరువనంతపురం ఎయిర్‌పోర్ట్ నుంచి F-35 ఫైటర్ జెట్ టేకాఫ్

పార్కింగ్‌ ఫీజు ఎంతంటే..?
తిరువనంతపురం ఎయిర్‌పోర్టును వినియోగించుకున్నందుకు అధికారికంగా యూకే ప్రభుత్వం ఎంత పార్కింగ్ ఛార్జీలు చెల్లింస్తుంది అనే వివరాలు బయటకు రాలేదు. అయితే అది లక్షల్లోనే ఉండే అవకాశం ఉంది. తిరువనంతపురం అంతర్జాతీయ విమానాశ్రయంలో పార్కింగ్, భద్రత, హ్యాంగర్ ఛార్జీలు కలిపి రోజుకు ₹2–3 లక్షలు వరకు ఉండొచ్చని విమానాశ్రయ వర్గాలు అంచనా వేస్తున్నాయి. 37 రోజుల పాటు విమానం అక్కడే నిలిచిన నేపథ్యంలో, మొత్తం ఖర్చు రూ. కోటి అంతకంటే ఎక్కువ అవుతుందనే అంచనా వేస్తున్నారు.

Videos

నామినేషన్ కు ర్యాలీగా YS అవినాష్ రెడ్డి

మిథున్ రెడ్డికి జగన్ పరామర్శ TDP దాడులపై రియాక్షన్

LIVE : టీడీపీ గూండాల దాడులపై మిథున్ రెడ్డి సంచలన Press Meet

ఎన్నికల్లోనూ రెడ్ బుక్ రాజ్యాంగం.. మిథున్ రెడ్డిపై హత్యాయత్నం రోజా రియాక్షన్

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)