Breaking News

'ప్రతి అవకాశంలో మహిళా రెజ్లర్లను వేధించాడు'

Published on Sun, 09/24/2023 - 11:35

ఢిల్లీ: రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (డబ్ల్యూఎఫ్‌ఐ) మాజీ చీఫ్ బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ అవకాశం దొరికినప్పుడల్లా మహిళా రెజ్లర్లను లైంగికంగా వేధించేందుకు ప్రయత్నించారని కోర్టుకు తెలిపారు ఢిల్లీ పోలీసులు. ఆయనపై అభియోగాలు మోపడానికి తగిన ఆధారాలు ఉన్నాయని పేర్కొన్నారు. 

తజకిస్థాన్‌లో ఈవెంట్ సందర్భంగా ఓ రెజ్లర్‌ను గదిలోకి పిలిచి హగ్‌ చేసుకునేందుకు ప్రయత్నించారని కోర్టుకు పోలీసులు తెలిపారు. బాధితురాలు నిరసన తెలిపితే.. తాను తండ్రిలాగే దగ్గరికి తీసుకున్నట్లు బ్రిజ్ భూషణ్ చెప్పారని న్యాయమూర్తికి పోలీసులు చెప్పారు. అనుమతి లేకుండా తన శరీర భాగాలను దురుద్దేశంతో తాకాడని మరో మహిళా రెజ్లర్ పేర్కొన్న విషయాన్ని కూడా ధర్మాసనానికి వెల్లడించారు. ఇవన్నీ బ్రిజ్ భూషణ్ దురుద్దేశంతోనే చేశాడని పోలీసులు తెలిపారు. 

మహిళా రెజ్లర్ల ఆరోపణలను పరిశీలించడానికి బాక్సింగ్ లెజెండ్ మేరీ కోమ్ నేతృత్వంలో కమిటీ కూడా బ్రిజ్‌ భూషణ్‌ను నిర్దేషిగా పేర్కొనలేదని ఢిల్లీ పోలీసులు తెలిపారు.  బ్రిజ్ భూషణ్‌పై ఆరోపణల దర్యాప్తుకు కేంద్రం ఓ కమిటీని నియమించింది. అందుకు సంబంధించిన రిపోర్టును బయటకు వెల్లడించలేదు. కానీ ఓ కాపీని ఈ కేసును దర్యాప్తు చేస్తున్న ఢిల్లీ పోలీసులకు అందించారు. 

మహిళ రెజ్లర్లపై లైంగిక వేధింపుల కేసులో గరిష్ఠంగా మూడేళ్లు ఉంటుంది. బ్రిజ్ భూషణ్ లైంగిక వేధింపులకు పాల్పడ్డాడని ఆరుగురు మహిళా రెజ్లర్లు జూన్ 15న కేసు నమోదు చేశారు. ప్రస్తుతం ఈ కేసును ఢిల్లీ కోర్టు విచారణ చేపడుతోంది. తదుపరి విచారణను అక్టోబర్ 7కు వాయిదా వేసింది.   

ఇదీ చదవండి: రమేశ్‌ బిధూరీపై సస్పెన్షన్‌ వేటు వేయాలి


 

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)