Breaking News

పెళ్లిలో స్కాన్‌ చదివింపులు

Published on Thu, 10/30/2025 - 12:14

ఏ ఇంట్లో ఏ శుభకార్యం జరిగినా.. పదో పరకో చదివింపులు జరుగుతూనే ఉంటాయి. దగ్గరివారైతే కొంచెం ఎక్కువ.. దూరపు చుట్టాలైతే చిన్న చిన్న గిఫ్ట్‌లతో పని కానిచ్చేస్తూంటాం. అయితే ఇప్పటివరకూ నగదు, బహుమతులతో సాగుతున్న ఈ చదివింపుల తంతు కేరళలో కొత్త అవతారమెత్తింది. పేటీఎం బాట పట్టింది. 

ఎలాగంటే.. కేరళలోని ఒకానొక ఊళ్లో ఒక పెళ్లి. బంధుమిత్రుల కోలాహలం, వధూ వరుల అచ్చట్లు ముచ్చట్లు ఎన్ని ఉన్నా.. ఈ వేడుకలో హైలైట్‌ మాత్రం పెళ్లికూతురి తండ్రి. తెల్లటి షర్టు, పంచెతో కనిపించిన ఈయనగారి జేబుపై పేటీఎం క్యూఆర్‌ కోడ్‌ పిన్‌ చేసి ఉంది మరి. పెళ్లికి కాదుకానీ... మూడేళ్ల క్రితం పంజాబ్‌, బీహార్‌లలో శుభకార్యాల్లో బ్యాండ్‌ వాయించే వారికి డిజిటల్‌ చదివింపుల చేసిన వాళ్లు ఉన్నారు. డ్రమ్ముకు అతికించిన క్యూఆర్‌ కోడ్‌ను స్కాన్‌ చేసి నజరానాలు సమర్పించిన వాళ్లు కొందరైతే.. డ్రమ్ముపైనే క్యూఆర్‌ కోడ్‌ ముద్రించుకుని మరీ నగదు ప్రశంసలు పొందిన వారు ఇంకొందరు. 

దేశంలో 2017లో మొదలైన ‘భారత్‌ క్యూఆర్‌’తో డిజిటల్‌ పేమెంట్లు చాలా సులువైన సంగతి అందరికీ తెలిసిందే. అప్పటి నుంచి ఇప్పటివరకూ ఈ క్యూఆర్‌ కోడ్‌ పేమెంట్‌ వ్యవస్థ అంతకంతకూ పెరుగుతూనే ఉంది. నేషనల్‌ పేమెంట్స్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా (ఎన్‌పీసీఐ) మాస్టర్‌కార్డ్‌, వీసాలతో మొదలుపెట్టగా.. తరువాతి కాలంలో దీన్ని అందరూ వాడటం మొదలైంది. పేటీఎం, ఫోన్‌పే, గూగుల్‌ పే వంటివి మూలమూలలకూ చేరిపోయాయి. గత ఏడాది దేశం మొత్తమ్మీద 35 కోట్లకుపైగా క్యూఆర్‌ కోడ్‌లు చెలామణిలో ఉన్నాయంటే ఇదెంత పాప్యులర్‌ అన్నది ఇట్టే అర్థమై పోతుంది.

క్యూఆర్‌ కోడ్‌లు పెట్టుకుని భిక్షమెత్తుకునే వారిని మనం చూసే ఉంటాం కానీ ఇలా వెరైటీగా చదివింపుల కోసం క్యూఆర్‌ కోడ్‌ను తొలిసారి వాడింది మాత్రం ఈయనే కాబోలు!. 

‘‘అయ్యలారా.. అమ్మలారా.. కూతురి పెళ్లికి బోలెడంత ఖర్చయిపోయింది... చేసే చదివింపులు ఏవో నాకూ కొంత ముట్టజెబితే... అదో తుత్తి’’ అన్నట్టుగా ఉంది ఆ తండ్రి వ్యవహారం. ఇన్‌స్టాగ్రామ్‌లో తెగవైరల్‌ అయిపోయింది ఈ వీడియో క్లిప్‌. కొంతమంది అతిథులు మొబైల్‌ఫోన్లతో స్కాన్‌ చేసి పేటీఎం చదివింపులు చేయించడమూ స్పష్టంగా కనిపించింది. సోషల్‌ మీడియాలో ఈ వీడియో పడిందే తడవు.. పలువురు పలు రకాల కామెంట్లూ చేస్తున్నారు. పెళ్లికూతురి తండ్రికి డిజిటల్‌ టెక్నాలజీపై ఉన్న మక్కువను, దేశంలో డిజిటల్‌ చెల్లింపులు సులువైన వైనాన్ని కొంతమంది బాగానే ప్రశంసించారు. మరికొందరు డిజిటల్‌ టెక్నాలజీ మన సంప్రదాయాలను మరుగున పడేలా చేస్తోందని నొసలు విరిచారు కూడా. ఏదైతేనేం.. ఆ పెళ్లికి వెళ్లిన వారందరూ ఆ తండ్రి చేష్టకు కాసేపు సరదాగా నవ్వుకున్నారు. ఇచ్చేదేదో ‘పే’ చేసేసి.. సుష్టుగా భోంచేసి మరీ వెళ్లిపోయారు. ఆశీర్వాదాలు వధూ వరులకు... క్యాష్‌ తండ్రికి అన్నమాట!


 

Videos

YSRCP నేతలు నామినేషన్లు వేయకుండా TDP మూకల దాడి

జగనన్న నాపై పెట్టిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటా

మా మిథున్ రెడ్డిని చంపేస్తారా? TDP గూండాల దాడిపై పెద్దిరెడ్డి రియాక్షన్..

రాష్టపతి దృష్టికి ఎంపీ మిథున్ రెడ్డి పై దాడి ఘటన

గంభీర్ మాస్టర్ ప్లాన్ .. వన్డేల నుండి బుమ్రా అవుట్?

నామినేషన్ కు ర్యాలీగా YS అవినాష్ రెడ్డి

మిథున్ రెడ్డికి జగన్ పరామర్శ TDP దాడులపై రియాక్షన్

LIVE : టీడీపీ గూండాల దాడులపై మిథున్ రెడ్డి సంచలన Press Meet

ఎన్నికల్లోనూ రెడ్ బుక్ రాజ్యాంగం.. మిథున్ రెడ్డిపై హత్యాయత్నం రోజా రియాక్షన్

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)