Breaking News

ఇద్దరు యువతులతో ప్రేమాయణం

Published on Tue, 04/01/2025 - 07:17

యశవంతపుర: బెళగావిలో ప్రేమికుడు మోసం చేశాడనే కారణంగా యువతి రెండురోజుల కిందట ఆత్మహత్య చేసుకొంది. ప్రైవేటు హాస్టల్లో యువతి ఆత్మహత్య కేసు కొత్త మలుపు తిరిగింది. మొదట ఆత్మహత్యకు కారణాలు తెలియరాలేదు. పోలీసులు విచారించగా ప్రేమించిన  ప్రియుడు మోసం చేయడంతో విరక్తి కలిగి విజయపురకు చెందిన ఎంబీఎ పట్టభద్రురాలు ఐశ్యర్వ లక్ష్మీ గలగలి (25) ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నట్లు  బయట పడింది.   ప్రియుడు ఆకాశ్‌ చడచణను బెళగావి ఎపిఎంసీ పోలీసులు అరెస్ట్‌ చేశారు.  

మృతదేహం వేలాడుతున్నా చూడకుండా..  
ఆకాశ్‌ ఐశ్వర్యతో ప్రేమాయణం నడుపుతూనే మరో యువతితోనూ ప్రేమపేరుతో షికార్లు సాగించేవాడు. ఈ సంగతి ఐశ్వర్యకు తెలిసి నిలదీసినా మార్పురాలేదు. మోసపోయాననే బాధతో ఐశ్యర్వ ఉరి వేసుకొని చనిపోయింది. ఐశ్యర్వ ఆత్మహత్య చేసుకోవడానికి ముందు ఆకాశ్‌ మొబైల్‌కు ఒక సందేశం పెట్టింది. నా మరణానికి నువ్వు, నీ ప్రియురాలే కారణమని తెలిపింది. 

దీంతో ఆందోళన చెందిన ఆకాశ్‌ తక్షణం ఐశ్యర్వ ఉంటున్న పీజీ వెళ్లి తలుపులు తట్టాడు. చివరకు తలుపును పగలగొట్టి ఆమె మొబైల్‌ని ఎత్తుకెళ్లాడు. ప్రియురాలు ఉరికి వేలాడుతున్నా కనీసం పట్టించుకోలేదు. అతడు వచ్చిన దృశ్యాలు పీజీలోని సీసీ కెమెరాలలో రికార్డు అయ్యాయి. ఇద్దరి మధ్య కాలేజీ రోజుల నుంచి ప్రేమ వ్యవహారం నడుస్తోంది. ఆకాశ్‌ బెళగావిలో ఒక ప్రైవేట్‌ సంస్థలో పని చేస్తున్నాడు. ఐశ్యర్వ ఎంబీఏ పూర్తిచేసి ఇంటర్న్‌íÙప్‌ చేస్తోంది. ఆకాశ్‌ను అరెస్ట్‌ చేసి విచారిస్తున్నారు.

 

Videos

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్ బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

తగ్గదేలే...మీసం మెలేసిన కొండా మురళి

ఫుల్ స్పీడ్ లో రవితేజ.. Next ప్రాజెక్ట్ ఎవరితో అంటే!

LIVE : కొండా సురేఖ సంచలన ప్రెస్ మీట్

భయం పట్టుకుంది అందుకే పోలవరం గురించి మాట్లాడటం మానేశా

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)