దాడి తర్వాత గాయాలతో మిథున్ రెడ్డి
Breaking News
బాలునికి మోమోల ఆశ చూపి...
Published on Tue, 02/03/2026 - 05:05
దేవరియా (యూపీ): పాపం పిల్లవాడు! మోమోలంటే మనవాడికి మహా ఇష్టం. ఆ ఇష్టాన్ని కాస్తా మోమో స్టాల్ నడిపే ముగ్గురు యువకులు భారీగా ‘సొమ్ము’ చేసుకున్నారు! బాలుని ఇంటినుంచి ఏకంగా రూ.85 లక్షల విలువైన నగలను అతనితోనే ఒక్కొక్కటిగా తెప్పించి మరీ కాజేశారు. ఉత్తరప్రదేశ్లో దేవరియాలోని దుమ్రీ చౌరస్తాలో ముగ్గురు యువకులు మోమో స్టాల్ నడుపుతు న్నారు.
ఏడో తరగతి చదువుతున్న ఓ పిల్లవాడు మోమోల కోసం తరచూ స్టాల్కు వెళ్లేవాడు. బాలుని అమా యకత్వాన్ని ఆసరాగా చేసుకున్న యువకులు, స్నేహం పేరుతో కొంతకాలం పాటు అతన్ని మచ్చిక చేసుకున్నారు. ఇంటి నుంచి నగలు తెచ్చిస్తే కావ్సాలినన్ని మోమోలు ఫ్రీగా ఇస్తామంటూ ఆశ చూపారు. దాంతో బాలుడు రోజుకొకటి చొప్పున నగలు తీసుకెళ్లి వారికిస్తూ వచ్చాడు. బాలుని అత్త అవసరం నిమిత్తం నగలు అడగడంతో విషయం బయటపడింది. అప్పటికే నిందితులు నగలతో ఉడాయించారు.
Tags : 1