Breaking News

బాలుడి ప్రైవేట్ పార్ట్స్‌పై కాల్చి వాతలు, స్కూల్ టీచర్‌ ఘాతుకం..!

Published on Mon, 07/27/2026 - 18:14

ఉత్తరప్రదేశ్‌లోని వారణాసిలోని ఒక ప్రైవేట్ పాఠశాలలో దారుణం చోటు చేసుకుంది. నర్సరీ చదువుతున్న ఐదేళ్ల చిన్నారి పట్ల ఉపాధ్యాయురాలు అత్యంత దారుణంగా ప్రవర్తించిన ఘటన దిగ్భ్రాంతి రేపింది. వాష్‌రూమ్‌కు వెళ్లనివ్వకపోవడంతో, ఆ బాలుడు యూరిన్‌ పాస్‌ చేశాడు. దీంతో బాలుడి ప్రైవేట్ భాగాలపై చాకు కాల్చివాతలు పెట్టి చిత్రహింసలకు గురిచేసిన ఘటన తీవ్ర విమర్శలకు తావిచ్చింది.

బాలుడు తండ్రి కేసరి కుమార్ తన కుమారుడికి జరిగిన అన్యాయంపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీని ప్రకారం  వారణాసిలోని పాండేపూర్ ప్రాంతంలో ఉన్న ఒక ప్రైవేట్ పాఠశాలలో ఈ ఘటన జరిగింది. నర్సరీ చదువుతున్నబాధిత బాలుడు టాయిలెట్‌కి వెళ్లడానికి అనుమతి ఇవ్వాలని ఉపాధ్యాయురాలు ప్రీతి కుష్వాహాను కోరాడు. కానీ ఆమె అందుకు అంగీకరించలేదు. దీంతో బాలుడు ప్యాంట్‌లోనే మూత్ర విసర్జన చేశాడు. దీంతో ఆగ్రహం వ్యక్తం చేసిన టీచర్, చిన్నారిని వేరే గదిలోకి తీసుకెళ్లి, చాకును వేడి చేసి ప్రైవేట్ భాగాలపై కాల్చి వాతలు పెట్టింది. అంతేకాకుండా బాలుడిని తీవ్రంగా కొట్టి, మళ్లీ ఈ తప్పు చేయవద్దని బెదిరించింది.

ఇదీ చదవండి: హెయిర్‌ ట్రాన్స్‌ప్లాంటేషన్‌ నా జీవితాన్నే మార్చేసింది

బాధతో ఇంటికి తిరిగొచ్చిన బాలుడు జరిగిన ఉదంతాన్ని తల్లిదండ్రులకు వివరించడంతో వారు షాకయ్యారు. వెంటనే స్థానిక పోలీస్ స్టేషన్‌ను ఆశ్రయించి అధికారికంగా ఫిర్యాదు చేశారు. టీచర్‌ దుర్మార్గాన్ని ప్రశ్నించిన తమపై స్కూల్ యాజమాన్యం బెదిరిస్తోందని కుటుంబ సభ్యులు మీడియా ముందు  వాపోయారు. బాధితుడి తండ్రి ఫిర్యాదు మేరకు స్పందించిన పోలీసులు టీచర్, ప్రిన్సిపాల్, పాఠశాల యాజమాన్యంపై కేసు నమోదు చేశారు. ప్రస్తుతం ఈ ఘటనపై పోలీసులు తదుపరి విచారణ జరుపు తున్నారు.

ఇదీ చదవండి: ఇండిగో విమానంలో పొగలు, ఎమర్జెన్సీ ల్యాండింగ్‌

 

అఖిలేష్ యాదవ్ స్పందన
ఈ ఘటనపై సమాజ్‌వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్ తీవ్రంగా స్పందించారు. ఇది అత్యంత తీవ్రమైన దారుణమైన ఘటన అన్నారు. దీనివల్ల ఆ చిన్నారిపై జీవితాంతం కోలుకోలేని మానసిక ప్రశాంతత దెబ్బతినే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు.  పిల్లలతో సానుభూతి, మానవత్వంతో ఎలా ప్రవర్తించాలో ఉపాధ్యాయులకు కనీస అవగాహన ఉండాలి. ఈ ఘటనపై వెంటనే కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

Videos

దసరాకి RC ఫాన్స్ కు అదిరిపోయే న్యూస్..!

హైకోర్టులో YSRCP పిటిషన్.. పొన్నవోలు వాదనలు

అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో అయ్యన్నపాత్రుడికి షాక్

కడపలో ఉద్రిక్తత నామినేషన్ పత్రాలు చించివేత

YSRCP నేతలు నామినేషన్లు వేయకుండా TDP మూకల దాడి

జగనన్న నాపై పెట్టిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటా

మా మిథున్ రెడ్డిని చంపేస్తారా? TDP గూండాల దాడిపై పెద్దిరెడ్డి రియాక్షన్..

రాష్టపతి దృష్టికి ఎంపీ మిథున్ రెడ్డి పై దాడి ఘటన

గంభీర్ మాస్టర్ ప్లాన్ .. వన్డేల నుండి బుమ్రా అవుట్?

నామినేషన్ కు ర్యాలీగా YS అవినాష్ రెడ్డి

Photos

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)