Breaking News

ఈడీకి రూ. లక్ష ఫైన్‌

Published on Wed, 01/22/2025 - 08:15

ముంబై: బాంబే హైకోర్టు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ)పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఒక వ్యక్తిపై అనవసరంగా మనీలాండరింగ్ కేసును చేపట్టినందుకు ఈడీని మందలించింది. ఈ కేసులో హైకోర్టు ఈడీకి లక్ష రూపాయల జరిమానా కూడా విధించింది.

ఎటువంటి బలమైన కారణం లేకుండా రియల్ ఎస్టేట్ డెవలపర్‌పై మనీలాండరింగ్ దర్యాప్తు చేపట్టిన నేపధ్యంలో బాంబే హైకోర్టు ఈడీకి జరిమానా విధించింది. ఈ సందర్భంగా కేంద్ర సంస్థలు చట్ట పరిధిలో పనిచేయాలని హైకోర్టు పేర్కొంది. పౌరులు అనవసరంగా వేధింపులకు గురికాకుండా  ఉండేందుకు చట్ట అమలు సంస్థలకు  సందేశం పంపాల్సిన అవసరం ఉందని జస్టిస్ మిలింద్ జాదవ్‌తో కూడిన సింగిల్ బెంచ్ పేర్కొంది.

వివరాల్లోకి వెళితే రాకేష్ జైన్ అనే రియల్ ఎస్టేట్ డెవలపర్‌(Real estate developer)పై నిబంధనల ఉల్లంఘన, మోసం ఆరోపణలపై ఒక ఆస్తి కొనుగోలుదారు కేసు నమోదు చేశారు. ఈ ఫిర్యాదు విలే పార్లే పోలీస్ స్టేషన్‌లో నమోదైంది. దీని ఆధారంగా రాకేష్ జైన్‌పై మనీలాండరింగ్ కేసును నమోదు చేసి, ఈడీ దర్యాప్తు చేపట్టింది. ఈ కేసు ఆగస్టు 2014 నాటిది. ఈడీ దాఖలు చేసిన ప్రాసిక్యూషన్‌పై ప్రత్యేక కోర్టు 2014 ఆగస్టులో నోటీసు జారీ చేసింది. తాజాగా మంగళవారం (జనవరి 21) ఈ కేసులో రాకేష్ జైన్‌పై ప్రత్యేక కోర్టు జారీ చేసిన నోటీసును హైకోర్టు రద్దు చేసింది.

జస్టిస్ జాదవ్ మాట్లాడుతూ ఇప్పుడు తనముందున్న కేసు.. మనీ లాండరింగ్ నిరోధక చట్టం(Anti-Money Laundering Act) అమలు ముసుగులో వేధింపులకు సంబంధించిన కేసుగా కనిపిస్తోందన్నారు. ఈ కేసులో ఫిర్యాదుదారునితో పాటు ఈడీ కూడా దురుద్దేశంతో చర్యలు చేపట్టిందని స్పష్టంగా తెలుస్తున్నదన్నారు. ఇందుకు కఠినమైన శిక్ష విధించాలన్నారు. ఈడీ వంటి కేంద్ర సంస్థలు చట్ట పరిధిలోనే వ్యవహరించాలని, చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకొని ఇలా పౌరులను వేధించడం తగదని సూచించింది.

ఇది కూడా చదవండి: Delhi Elections-2025: 12 ఎస్సీ సీట్లు.. విజయానికి కీలకం

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)