Breaking News

నేరం చేశారంటే నమ్మలేం

Published on Mon, 07/21/2025 - 10:41

ముంబై: ముంబైలో 19 ఏళ్ల క్రితం 180 మందికిపైగా ప్రాణాలను బలిగొన్న రైలు పేలుళ్ల కేసులో సోమవారం కీలక పరిణామం సంభవించింది. పోలీసులు నేర నిరూపణలో ఘోరంగా విఫలమయ్యారని బాంబే హైకోర్టు పేర్కొంది. నిందితులు ఈ నేరం చేశారంటే నమ్మడం కష్టంగా ఉందని వ్యాఖ్యానించిన న్యాయస్థానం మొత్తం 12 మందినీ నిర్దోషులుగా ప్రకటిస్తూ తీర్పు వెలువరించింది. ‘నిందితుల నేరాంగీకార ప్రకటనలు ఏమా త్రం ఆమోదయోగ్యంగా లేవు. అవన్నీ కాపీ చేసినట్లుగా కనిపిస్తున్నాయి.

 నేరం అంగీకరించాలంటూ పోలీసులు తమను తీవ్రంగా హింసించారని పేర్కొనడం ద్వారా నిందితులు నేరాంగీకార విశ్వసనీయతను మరింత దెబ్బతీశారు’అని వ్యాఖ్యానించింది. నేరానికిగాను ఏ రకం బాంబులు వాడారనే విషయం కూడా పోలీసులు చెప్పలేకపోయారని, సేకరించిన ఆధారాలు నేరనిరూపణకు సరిపోయేవి కావంది. ‘బాంబులు, సర్క్యూట్‌ బాక్సుల వంటి స్వాధీనమైన వస్తువులకు సరిగ్గా సీళ్లు వేయలేదు. వాటిని జాగ్రత్తగా భద్రపర్చలేదు.

 కీలకమైన సాక్షులను ప్రశ్నించడంలోనూ విఫలమైంది’అంటూ ప్రాసి క్యూషన్‌ తీరుపై విరుచుకుపడింది. నిందితులకు న్యాయపరమైన సాయం అందించకుండానే నేరాంగీకార ప్రకటన రికార్డు చేయడాన్ని కూడా ధర్మాసనం తప్పుబట్టింది. నిందితుల నేరాంగీకార స్టేట్‌మెంట్లలో ఏమాత్రం స్పష్టత లేదంది. పేలుళ్ల కేసుకు మహారాష్ట్ర కంట్రోల్‌ ఆప్‌ ఆర్గనైజ్డ్‌ క్రైం యాక్ట్‌(మోకా)ను వాడకపోవడాన్ని ఎత్తి చూపింది.

 ‘అసలైన నేరస్తుడిని శిక్షించడం నేర కార్యకలా పాలను అరికట్టడానికి, చట్టాన్ని నిలబెట్టడానికి, పౌరుల భద్రతను నిర్ధారించే దిశలో ఒక ముఖ్య మైన అడుగు’అని జస్టిస్‌ అనిల్‌ కిలోర్, జస్టిస్‌ శ్యామ్‌ చందక్‌ల ధర్మాసనం తన 671 పేజీల తీర్పులో పేర్కొంది. ‘అందుకు విరుద్ధంగా ప్రజల విశ్వాసాన్ని దెబ్బతీసేలా, సమాజానికి తప్పుడు సంకేతాన్ని పంపేలా ప్రాసిక్యూషన్‌ వ్యవహరించింది. అసలైన ముప్పు ఇప్పటికీ తొలగలేదనే విషయం ఈ కేసుతో తేటతెల్లమైంది’అని మండిపడింది. ‘నిందితులపై కేసును నిరూపించడంలో ప్రాసిక్యూషన్‌ పూర్తిగా విఫలమైంది.

 నిందితులు నేరానికి పాల్పడ్డారని నమ్మడం కష్టం. అందుకే వారిపై ఆరోపణలను కొట్టివేస్తున్నాం’ అని ధర్మాసనం పేర్కొంది. రైళ్లలో బాంబులు అమర్చడం తదితర నేరాలకు పాల్పడిన ఆరోపణలపై ప్రత్యేక కోర్టు మరణ శిక్ష ప్రకటించిన నలుగురితోపాటు జీవిత కాల జైలు శిక్షలు పడిన ఏడుగురిని నిర్దోషులుగా ప్రకటిస్తూ తీర్పు వెలువరించింది. వీరిలో మరణ శిక్ష పడిన కమాల్‌ అన్సారీ 2021లో జైలులోనే చనిపోయాడు.  మహానగరం ముంబైలోని స్థానిక రైళ్లు ఏడింటిలో 2006 జూలై 11న పేలుళ్లు సంభవించాయి. ఘటనల్లో 180 మందికిపైగా ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే.

 

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)