Breaking News

‘ఖబడ్దార్‌..’ విజయ్‌ ఇంటికి బాంబు బెదిరింపు

Published on Thu, 10/09/2025 - 10:41

చెన్నై: తమిళ అగ్రనటుడు, టీవీకే అధినేత విజయ్‌ ఇంటికి గురువారం బాంబు బెదిరింపు వచ్చింది. దీంతో నీలగిరిలోని ఆయన నివాసం వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది. పోలీసులు భద్రతను కట్టుదిట్టం చేయగా.. కాల్‌ చేసిన ఆగంతకుడ్ని గుర్తించే పనిలో ఉన్నారు. 

చెన్నై పోలీసులకు కాల్‌ చేసిన సదరు వ్యక్తి.. భవిష్యత్తులో విజయ్‌ గనుక పబ్లిక్‌ ర్యాలీలు నిర్వహిస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయని, ఇంటిని బాంబుతో పేల్చేస్తానని హెచ్చరించినట్లు సమాచారం. ఆ కాల్‌ కోయంబత్తూరు నుంచి వచ్చినట్లు నిర్ధారించుకున్న పోలీసులు అతన్ని పట్టుకునే ప్రయత్నంలో ఉన్నారు. ఇదిలా ఉంటే.. 

సెప్టెంబర్‌ 27వ తేదీన కరూర్‌లో నిర్వహించిన టీవీకే ర్యాలీలో తొక్కిసలాట జరిగి 41 మంది మరణించారు.  ఘటన తర్వాత విజయ్‌ కనీసం బాధితులను పరామర్శించకుండా అక్కడి నుంచి వెళ్లిపోవడం తీవ్ర విమర్శలకు తావిచ్చింది. ఆపై దాడులు జరిగే అవకాశం ఉండడంతో.. విజయ్‌ ఇంటికి పోలీసు భద్రతను పెంచారు.

ఈ ఘటనపై నమోదైన కేసులో టీవీకే నేతలను పోలీసులు అరెస్ట్‌ చేశారు. ఘటనపై దర్యాప్తునకు తమిళనాడు ప్రభుత్వం రిటైర్డ్‌ జడ్జితో కమిటీ వేయగా, మద్రాస్‌ హైకోర్టు సిట్‌ ఏర్పాటునకు ఆదేశించింది. అయితే టీవీకే మాత్రం ఈ ఘటనలో కుట్ర కోణం ఉందని, సీబీఐ లాంటి స్వతంత్ర దర్యాప్తు సంస్థను నియమించాలని డిమాండ్‌ చేస్తోంది. ఇక.. కరూర్‌ ఘటన నేపథ్యంలో రాజకీయ సభలకు, ర్యాలీలకు ప్రత్యేకమైన మార్గదర్శకాలను రూపొందించే పనిలో తమిళనాడు ప్రభుత్వం ఉంది. ఆ మార్గదర్శకాలను జారీ చేసే దాకా.. తమిళనాడులో ఏ పార్టీకి ఎలాంటి సభలకు, ర్యాలీలకు అనుమతులు ఇవ్వబోమని ఇప్పటికే మద్రాస్‌ హైకోర్టుకు స్పష్టం చేసింది కూడా. 

ఇదిలా ఉంటే.. తమిళనాడు (Tamil Nadu)లో వరుస బాంబు బెదిరింపులు కలకలం సృష్టిస్తున్నాయి. గతకొంతకాలంగా సినీ, రాజకీయ ప్రముఖుల ఇళ్లతో పాటు పలు ప్రదేశాలకు బాంబు బెదిరింపులు వస్తున్నాయి. రాష్ట్ర ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌, సినీ తారలు త్రిష, నయనతార నివాసాలతో పాటు బీజేపీ ప్రధాన కార్యాలయానికి, డీజీపీ ఆఫీసుకి, రాజ్‌భవన్‌కు కూడా బాంబు బెదిరింపులు వచ్చాయి. దీంతో భద్రతా బలగాలు అప్రమత్తమై క్షుణ్ణంగా తనిఖీలు జరిపి.. ఆ బెదిరింపులు ఉత్తవేనని తేల్చాయి. 

ఇదీ చదవండి: కరూర్‌ బాధితులకు విజయ్‌ పరామర్శ

Videos

వైరల్ అవుతున్న కొండా మురళీ ట్వీట్

ఇస్రో మరో ఘన విజయం.. GSLV-F07 రాకెట్ ప్రయోగం సక్సెస్..!

ప్రజలకు శ్రీకృష్ణాష్టమి శుభాకాంక్షలు తెలిపిన YS జగన్

బిడ్డ వ్యాఖ్యలను సురేఖ ఖండించాలి.. కానీ ఆమె ఆ పని చేయలేదు

అడ్డంగా బుక్కైన లోకేష్ ..! అర్హత ఉన్న స్వాతికి నో జాబ్.. టెట్ లో ఫెయిల్ వ్యక్తికి టీచర్ జాబ్?

మమ్మల్ని కుక్కలకన్నా హీనంగా చూస్తున్నారు అన్న... తాటిపర్తి ముందు వెలిగొండ నిర్వాసితులు కన్నీరు

మీరు ఏమైనా అనుకోండి జనసేన ఒక చెత్త పార్టీ..! జనసేన నాయకుల భార్యలే మనుసులా

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్.. బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

పోలవరం అంటే గుర్తొచ్చేది YSR... బాబు క్రెడిట్ చోరీపై ఉండవల్లి సెటైర్లు

తెలంగాణ క్యాబినెట్ లో భారీ మార్పులు.. నెక్స్ట్ టార్గెట్ వాళ్లేనా..?

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)