Breaking News

పాకిస్తాన్‌ నుంచి 14 మంది ఉగ్రవాదులు,  400 కిలోల ఆర్డీఎక్స్‌

Published on Fri, 09/05/2025 - 15:28

ముంబై: గణపతి నిమజ్జనోత్సవ ఏర్పాట్లలో తలమునకలై ఉన్న ముంబై యంత్రాంగాన్ని ఓ బెదిరింపు సందేశం మరింత అప్రమత్తం చేసింది. ‘పాకిస్తాన్‌ నుంచి మహానగరంలోకి 14 మంది ఉగ్రవాదులు ప్రవేశించారు. వివిధ ప్రాంతాల్లో 34 వాహనాల్లో 400 కిలోల ఆర్డీఎక్స్‌తో మానవ బాంబులు సిద్ధంగా ఉన్నాయి. శనివారం అనంత్‌ చతుర్దశి(గణేశ్‌ నిమజ్జనోత్సవం) నాడు ముంబై నగరం పేలుళ్లతో దద్దరిల్లిపోతుంది. 

కనీసం కోటి మంది చనిపోతారు’అని ముంబై ట్రాఫిక్‌ పోలీసు విభాగం ఫోన్‌ వాట్సాప్‌కు ‘లష్కర్‌– ఇ–జిహాదీ’పేరుతో శుక్రవారం ఒక మెసేజీ అందింది. దీంతో, హై అలెర్ట్‌ ప్రకటించినట్లు ముంబై పోలీస్‌ విభాగం పేర్కొంది. దీనిని కేవలం బెదిరింపుగానే భావిస్తున్నామని సీనియర్‌ అధికారి ఒకరు తెలిపారు. అయినప్పటికీ, సాధ్యమైన అన్ని ముందు జాగ్రత్త చర్యలను తీసుకుంటున్నామని స్పష్టం చేశారు. ఈ సందేశాన్ని పంపించిన వ్యక్తి ఎవరో కనిపెట్టే ప్రయత్నాల్లో ఉన్నామన్నారు.

 దీనిపై అన్ని కోణాల్లోనూ విచారణ కొనసాగుతోందన్నారు. ముఖ్యమైన ప్రదేశాల్లో బందోబస్తును మరింతగా పెంచారు. వివిధ ప్రాంతాల్లో తనిఖీలను ముమ్మరం చేశారు. వదంతులను నమ్మొద్దని, అనుమానాస్పద కదలికల గురించిన సమాచారాన్ని వెంటనే తమకు అందజేయాలని ప్రజలను కోరారు. 

శనివారం జరిగే నిమజ్జన ఉత్సవాల బందోబస్తులో 12 మంది అదనపు కమిషనర్లు, 40 మంది డిప్యూటీ కమిషనర్లు, 61 మంది సహాయ కమిషనర్లు సహా 21 వేల మంది పోలీసులను వినియోగిస్తున్నారు. ట్రాఫిక్‌ సంబంధ సమస్యలను ముందుగానే కనిపెట్టి హెచ్చరించేందుకు ఈసారి ముంబై పోలీసు యంత్రాంగం కృత్రిమ మేధ సాయం తీసుకుంటోంది. ఇటీవలి కాలంలో ముంబై, థానె పోలీసులకు పలుమార్లు బెదిరింపు సందేశాలు అందడం తెల్సిందే. జూలైలో సైతం ముంబై విమానాశ్రయంలో బాంబు పెట్టామంటూ పోలీసులకు సందేశం అందింది. 

 

Videos

గుంటూరు పెదకాకానిలో హై టెన్షన్

జనసేన MLAపై బాబు సీరియస్

స్మృతి మందాన రికార్డు సెంచరీ.. సెమిస్ లో భారత్

24 క్యారెట్ గోల్డ్ కు LOAN ఎందుకు ఇవ్వరు? అసలు కారణం ఇదే

బాహుబలి, RRR రికార్డ్స్ పై కన్నేసిన ఇరుముడి..

నేపాల్ లో మృత్యుఘోష..! 1300కు చేరువలో మృతులు

కడప TDPలో మేయర్ పీఠం కోసం వార్..

మంటల్లో కాలిపోయిన ప్రైవేట్ బస్సు..!

వైరల్ అవుతున్న కొండా మురళీ ట్వీట్

ఇస్రో మరో ఘన విజయం.. GSLV-F07 రాకెట్ ప్రయోగం సక్సెస్..!

Photos

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు