Breaking News

ఢిల్లీని ఖలిస్థాన్ చేస్తాం.. స్కూళ్లలో బాంబులు పెట్టాం

Published on Mon, 02/09/2026 - 10:19

దేశ రాజధాని ఢిల్లీలో బాంబు బెదిరింపుల కలకలం రేగింది. రాజధాని పరిసర ప్రాంతాల్లోని తొమ్మిది స్కూళ్లలో బాంబులు పెట్టామంటూ ఈరోజు( సోమవారం) ఉదయం బెదిరింపు మెయిల్స్ వచ్చాయి. అఫ్జల్ గురు  జ్ఞాపకార్థం ఢిల్లీ ఖలిస్థాన్ గా మార్చబోతున్నామంటూ అందులో ఉంది. దీంతో అప్రమత్తమైన అధికారులు వెంటనే ఆ స్కూళ్లను ఖాళీ చేయించారు.

బాంబు స్క్వాడ్ బృందాలతో పాటు జాగీలాలతో  ప్రత్యేక తనిఖీలు నిర్వహిస్తున్నారు. రోహిణి ప్రాంతంలోని వెంకటేశ్వర     గ్లోబల్ స్కూల్, శ్రీనివాస పురిలోని లోరిటో కాన్వెంట్ స్కూల్, సిద్దిఖీ నగర్ లోని ఇండియన్ పాఠశాలతో మరికొన్ని ఈ జాబితాలో ఉన్నాయి.అయితే ఈ మధ్య కాలంలో పాఠశాలలకు తరచుగా బాంబు బెదిరింపులు వస్తున్నాయి.    

జనవరి 29న రాజధానిలో ఐదు విద్యాలయాలకు  బాంబు బెదిరింపులు వచ్చాయి. తీరా అధికారులు తనిఖీలు చేయగా అది బెదిరింపు మెయిల్ అని తేలింది.  అదే విధంగా జనవరి 28న ద్వారకా కోర్టు కాంప్లెక్స్ లోనూ  పేలుడు పధార్థాలు పెట్టామంటూ మెయిల్ రాగా పోలిసులు తనిఖీలు చేపట్టగా అది అబద్ధమని తేలింది.

అయితే దీనిపై ఢిల్లీ పోలీసులు స్పందించారు. ఇలా బెదిరింపు మెయిల్స్ చేసిన వారి వివరాలు ఆరా తీస్తున్నామని తెలిపారు.  నిందితులను గుర్తించిన అనంతరం వారిపై కఠిన చర్యలు తీసుకోనున్నట్లు ప్రకటించారు.

#

Tags : 1

Videos

జగనన్న నాపై పెట్టిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటా

మా మిథున్ రెడ్డిని చంపేస్తారా? TDP గూండాల దాడిపై పెద్దిరెడ్డి రియాక్షన్..

రాష్టపతి దృష్టికి ఎంపీ మిథున్ రెడ్డి పై దాడి ఘటన

గంభీర్ మాస్టర్ ప్లాన్ .. వన్డేల నుండి బుమ్రా అవుట్?

నామినేషన్ కు ర్యాలీగా YS అవినాష్ రెడ్డి

మిథున్ రెడ్డికి జగన్ పరామర్శ TDP దాడులపై రియాక్షన్

LIVE : టీడీపీ గూండాల దాడులపై మిథున్ రెడ్డి సంచలన Press Meet

ఎన్నికల్లోనూ రెడ్ బుక్ రాజ్యాంగం.. మిథున్ రెడ్డిపై హత్యాయత్నం రోజా రియాక్షన్

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)