Breaking News

అహ్మదాబాద్‌కు ‘బోయింగ్‌’ నిపుణులు.. ప్రమాదంపై విశ్లేషణ

Published on Mon, 06/16/2025 - 12:49

అహ్మదాబాద్: గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో చోటుచేసుకున్న విమాన ప్రమాదంపై అన్నివైపుల నుంచి దర్యాప్తు జరుగుతోంది. తాజాగా ప్రమాదంపై విశ్లేషించేందుకు ‘బోయింగ్’ నిపుణులు సోమవారం అహ్మదాబాద్‌కు చేరుకున్నారు. 242 మందితో  సర్దార్ వల్లభాయ్ పటేల్ అంతర్జాతీయ విమానాశ్రయం నుండి లండన్‌కు బయలుదేరిన బోయింగ్ 787-8 డ్రీమ్‌లైనర్ కొద్ది క్షణాల్లోనే అహ్మదాబాద్‌లోని ఒక వైద్య కళాశాలపై కూలిపోయింది.

ఈ ప్రమాదంలో 11 ఏ సీటులో కూర్చున్న ప్రయాణికుడు మినహా మిగిలిన అందరూ మృతిచెందారు. బోయింగ్ 787-8 డ్రీమ్‌లైనర్‌ను 2023 జూన్‌లో సమగ్రంగా తనిఖీ చేశారు. ఈ  ఏడాది డిసెంబర్‌లో  తిరిగి సమగ్ర తనిఖీలు చేయాల్సివుందని అధికారులు తెలిపారు. ఎయిర్ ఇండియా విమాన ప్రమాదంపై దర్యాప్తు చేస్తున్న అధికారులు కాక్‌పిట్ వాయిస్ రికార్డర్ దొరికిందని ధృవీకరించారు. ఇది ప్రమాదానికి గల కారణాన్ని నిర్ధారించడంలో వారికి సహాయపడనుంది.
 

ఆదివారం బీజే  ప్రమాద స్థలాన్ని పరిశీలించిన ప్రధాని నరేంద్ర మోదీ ప్రిన్సిపల్ సెక్రటరీ పికె మిశ్రాకు అధికారులు ఈ విషయాన్ని తెలియజేశారు. విమానంలో కీలకమైన డేటాను రికార్డ్ చేసే పరికరం హాస్టల్ పైకప్పుపై  లభ్యమయ్యింది. ఎయిర్‌క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో (ఎఎఐబి) ప్రమాదంపై దర్యాప్తును ప్రారంభించింది. యూఎస్ నేషనల్ ట్రాన్స్‌పోర్టేషన్ సేఫ్టీ బోర్డు అంతర్జాతీయ ప్రోటోకాల్‌ల  కింద సమాంతర దర్యాప్తును నిర్వహిస్తోంది.



ఇది కూడా చదవండి: 2027 మార్చి ఒకటి నుంచి జనగణన.. ప్రక్రియ ఇదే..
 

Videos

అమెరికా యుద్ధ నౌకలపై ఇరాన్ క్షిపణి దాడులు

ACల దొంగలు.. వైరల్ అవుతున్న వీడియో

ధురంధర్ డైరెక్టర్ తో టాక్సిక్ హీరో.. పాన్ ఇండియా షేక్ చేసే కాంబో?

శ్రీ చరణి దెబ్బ అదుర్స్! 55 పరుగులకే పాక్ ఆలౌట్..

టీచర్ ఉద్యోగం కోసం 12 లక్షలు అడిగారు.. లోకేష్ మనుషులు వచ్చి మాట్లాడుతారు అంటూ..

SBI గుడ్ న్యూస్.. రూ.15 లక్షల స్కాలర్ షిప్!

10 రోజులుగా శిథిలాల కింద.. చివరకు ప్రాణాలతో బయటకు..!

DSCలో స్కాం జరగకపోతే CBI విచారణకు సిద్ధమా..?

పుట్టలో పాముల్లా బయటికొస్తున్న DSC అక్రమాలు

జూడో ఫేక్ సర్టిఫికెట్లతో ఉద్యోగం

Photos

+5

అగ్నిపరీక్షలో గెలిచి 'బిగ్‌బాస్' 10లోకి రైతుబిడ్డ ఎంట్రీ (ఫొటోలు)

+5

దేవకన్యలా 'మ్యాడ్' ఫేమ్ అనంతిక (ఫొటోలు)

+5

హైదరాబాద్‌లో ‘రన్ ఫర్ నేచర్'(ఫొటోలు)

+5

పింక్ బ్యూటీ ప్రియాంక మోహన్ (ఫొటోలు)

+5

'మారెమ్మ' ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

డీఎస్సీలో అక్రమాలపై వైఎస్సార్‌సీపీ ‘గురు పరిరక్షణ దీక్ష’ (ఫొటోలు)

+5

'తెల్ల కాగితం' సినిమా టీజర్ లాంచ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

ఏడాదిన్నర తర్వాత వస్తున్న వైష్ణవి చైతన్య (ఫొటోలు)

+5

‘టార్టాయిస్’ మూవీ ఫస్ట్ లిరికల్ సాంగ్ లాంచ్ (ఫొటోలు)

+5

విశాఖలో ఘనంగా కృష్ణాష్టమి వేడుకలు (ఫొటోలు)