Breaking News

బిహార్‌లో ప్రమాదం.. 40 మందితో వెళుతున్న పడవ బోల్తా

Published on Sun, 07/19/2026 - 21:12

పాట్నా: బిహార్‌లోని సీతామర్హి జిల్లాలో  ఘెర ప్రమాదం జరిగింది. బాగ్‌మతి నదిలో దాదాపు 40 మందితో ప్రయాణిస్తున్న ఓ పడవ బరువు తట్టుకోలేక నదిలో బోల్తాపడింది. అక్కడే ఉన్న స్థానికులు వెంటనే స్పందించి నదిలో పడ్డవారిని రక్షించారు. దీంతో పెను ప్రమాదం తప్పింది. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

బాగ్‌మతి నదికి ఇరువైపులా ఉన్న గ్రామాలకు వెళ్లాలంటే ఖచ్చితంగా ఈ నది దాటాల్సిందే. అయితే ఈ నదిపై ప్రభుత్వం వంతెన నిర్మించకపోవడంతో రోజూ గ్రామస్థులు, రైతులు, విద్యార్థులు, ఇతర వ్యాపారులు తమ రోజువారీ పనులకోసం పడవల ద్వారానే రాకపోకలు సాగిస్తుంటారు. కాగా పడవలు నడిపే వారు సామర్థ్యంకు మించి ప్రయాణికులను ఎక్కించుకోవడంతోనే ఈ ప్రమాదం జరిగిందని గ్రామస్థులు అంటున్నారు. వారు తక్షణమే స్పందించడంతోనే ఎవరికి ప్రాణాపాయం కలగలేదని చెబుతున్నారు.

ప్రమాదం జరిగిన వెంటనే సమాచారం అందుకున్న స్థానిక పరిపాలనా యంత్రాంగం, పోలీస్ అధికారులు ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. దీనిపై స్పందించిన అధికారులు ఇకపై ఇలాంటి ప్రమాదాలు జరగకుండా ఓవర్‌ లోడింగ్‌కు పాల్పడే నావికులపై కఠిన చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. నదిలో నడిచే అన్ని పడవల్లో తప్పనిసరిగా లైఫ్ జాకెట్లు, లైఫ్ బాయ్స్ వంటి ప్రాణరక్షణ పరికరాలను అందుబాటులో ఉంచాలని  నావికులకు ఆదేశాలు జారీ చేశారు.

#

Tags : 1

Videos

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

మున్సిపల్ ఎన్నికలపై జగన్ ఫోకస్.. రెండో జాబితాలో బీసీలకు పెద్దపీట..!

తిరుపతిలో దారుణం.. నామినేషన్ వేయడానికి వెళ్లిన మహిళ బట్టలు చింపి...

Photos

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య