Breaking News

‘కబూతర్‌ ఖానా’ మూసివేతపై క‌న్నెర్ర‌.. ఏం జ‌రిగింది?

Published on Thu, 08/07/2025 - 19:20

ముంబై: దాదర్‌లోని ప్రముఖ కబూతర్‌ ఖానా మూసివేత వివాదం రోజురోజుకూ ముదురుతోంది. కబూతర్‌ ఖానాను మూసివేయాలని బృహన్ముంబై మున్సిపల్‌ కార్పొరేషన్‌ (బీఎంసీ) తీసుకున్న నిర్ణయంపై ముంబైకర్ల నుంచి తీవ్ర వ్యతిరేకత వస్తోంది. పావురాలకు దాణా వేయవద్దని బీఎంసీ ఆదేశాలు జారీ చేసింది. ఒకవేళ ఎవరైనా దాణా వేసే ప్రయత్నం చేస్తే వారిపై చర్యలు తీసుకోవాలని స్పష్టం చేసింది. ఆ మేరకు కబూతర్‌ ఖానాపై పావురాలు వచ్చి వాలకుండా, పక్షుల ప్రేమికులు దాణా వేయకుండా ప్లాస్టిక్‌ షీట్‌ను కప్పారు. దీంతో కబూతర్‌ ఖానాకు ఎదురుగా ఉన్న జైన్‌ మందిరానికి వచ్చే భక్తులు, సామాన్య ప్రజలు తీవ్ర ఆగ్రహానికి గురయ్యారు. బుధవారం ఉదయం పెద్ద సంఖ్యలో అక్కడకు వచ్చిన జైన్‌ సమాజం ప్రజలు ప్లాస్టిక్‌ షీట్‌ను తొలగించే ప్రయత్నం చేశారు. దీంతో అక్కడ ఉద్రిక్తత వాతావరణం నెలకొంది.

బీఎంసీ అధికారులు, సిబ్బంది, పావురాలకు దాణా వేయకుండా కాపలా కాస్తున్న పోలీసులు, జైన్‌ సమాజం ప్రజల మధ్య కొద్దిసేవు వాగ్వాదం నెలకొంది. కబూతర్‌ ఖానాను మూసివేయవద్దంటూ సాధారణ ప్రజలు, జైన్‌ వర్గం ప్రజలు నినాదాలు చేస్తూ నిరసన తెలిపారు. దీంతో దాదర్‌ రైల్వే స్టేషన్‌ దిశగా వెళ్లే రోడ్డుపై ట్రాఫిక్‌ జామ్‌ అయింది. కబూతర్‌ ఖానా (Kabutar khana) చుట్టూ తిరిగి వచ్చే వాహనాలు కూడా ఎక్కడిక్కడే నిలిచిపోవడంతో కిలోమీటరు మేర వాహనాలు నిలిచిపోయాయి. దీంతో ఉదయం విధులకు వెళ్లే వివిధ రంగాల ఉద్యోగులు, వ్యాపారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. కాగా బాంబే హైకోర్టు (Bombay High Court) ఆదేశాల మేరకే కబూతర్‌ ఖానాను మూసివేయాలని నిర్ణయం తీసుకున్నట్లు బీఎంసీ అధికారులు తెలిపారు. అయినప్పటికీ వీరంతా ఆందోళనను ఆపలేదు. దీంతో కబూతర్‌ ఖానాను మూసియబోమని బీఎంసీ అధికారులు తాత్కాలికంగా ప్రకటించడంతో ఆందోళన విరమించారు.  

హైకోర్టు నిర్ణయం మేరకే మూసివేత: బీఎంసీ
ముంబై నడిబొడ్డున ఉన్న దాదర్‌ ప్రాంతంలో కబూతర్‌ ఖానా ఉంది. దాదర్‌లో పశ్చిమ, సెంట్రల్‌ రైల్వే మార్గాలు కలుస్తాయి. అంతేగాకుండా ఇక్కడ ఫాస్ట్‌ లోకల్‌ రైళ్లతోపాటు ఛత్రపతి శివాజీ మహారాజ్‌ టర్మినస్‌ (సీఎస్‌ఎంటీ) నుంచి దూరప్రాంతాలకు బయలుదేరే, అక్కడి నుంచి సీఎస్‌ఎంటీ దిశగా వెళ్లే మెయిల్, ఎక్స్‌ప్రెస్, వందేభారత్, దురంతో వంటి ఆధునిక రైళ్లు ఆగుతాయి. అదేవిధంగా దాదర్‌ వివిధ వ్యాపారాలకు కేంద్ర బిందువుగా ఉంది. దీంతో ఈ ప్రాంతం ఉదయం నుంచి అర్ధరాత్రి వరకు ప్రయాణికులు, షాపింగ్‌లకు వచ్చే జనాల రాకపోకలతో బిజీగా ఉంటుంది. దాదర్‌ పశ్చిమ దిశలో సుమారు 60 ఏళ్ల కిందట నిర్మించిన కబూతర్‌ ఖానా రైల్వే స్టేషన్‌కు కూతవేటు దూరంలో ఉంది. అప్పటితో పోలిస్తే ఇప్పుడు సుమారు వంద రెట్లు వాహనాలు, జనాల సంఖ్య పెరిగింది.

ముక్కు మూసుకుని వెళ్లాల్సి వస్తోంది
ముఖ్యంగా ఈ కబూతర్‌ ఖానావల్ల రాకపోకలు సాగించే జనాలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పావురాలకు వేస్తున్న దాణా కుళ్లిపోవడం, వాటి రెట్టల వల్ల పరిసరాలు తీవ్ర దుర్గంధం వెదజల్లుతున్నాయి. వాటి శరీరంలో ఉన్న సుక్ష్మజీవులవల్ల ప్రజల ఆరోగ్యానికి హానీ జరుగుతుంది. దీంతో ఈ ప్రాంతం మీదుగా రాకపోకలు సాగించేవారు ముక్కు మూసుకుని వెళ్లాల్సి వస్తోంది. రెట్టల వల్ల ఉత్పన్నమయ్యే సూక్ష్మజీవులతో వివిధ రకాల తీవ్ర శ్వాసకోశ సమస్యలను ఎదుర్కొంటున్నారు. దీంతో ఈ వివాదం ముంబై హైకోర్టు వరకు వెళ్లింది. దీంతో ఇటీవల జరిగిన విచారణలో మనుషుల ఆరోగ్యంతో చెలగాటమాడే అధికారం ఎవరికి లేదని, దాదర్‌తోపాటు ఉప నగరాల్లో ఉన్న కబూతర్‌ ఖానాలన్నీ మూసి వేయాలని ఇటీవలి విచారణ సందర్భంగా కోర్టు ఆదేశించింది.

ఈ మేరకు పావురాలకు దాణా వేయకూడదని, ఒకవేళ వేస్తే చర్యలు తీసుకుంటామని బీఎంసీ (BMC) హెచ్చరించింది. అనేక ప్రాంతాల్లో బోర్డులు, ప్లెక్సీలు ఏర్పాటు చేసింది. బందోబస్తుకోసం పోలీసులను ఏర్పాటుచేసింది. అంతటితో ఊరుకోకుండా కబూతర్‌ ఖానా చుట్టూ ఆధునిక సీసీ టీవీ కెమరాలు ఏర్పాటు చేసింది. మూసివేసే ప్రయత్నంలో భాగంగా కబూతర్‌ఖానా చుట్టు ప్లాస్టిక్‌ షీట్‌ కప్పడంతో పక్షి ప్రేమికులు, సాధారణ ప్రజల ఆగ్రహం కట్టలు తెంచుకుని ఆందోళన చేపట్టారు. మూసివేయబోమని తాత్కాలికంగా బీఎంసీ అధికారులు స్పష్టం చేయడంతో ఆందోళన విరమించుకున్నారు.

చ‌ద‌వండి: ఆటోలో రెండు రోజుల్లో 1400 కి.మీ. ప్ర‌యాణం!  

Videos

విద్యా శాఖ కమిషనర్ Vs ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి

ఫస్ట్ డేనే ఇంట్లో రణరంగం.. నాయకుడి కోసం పెద్ద గొడవ! రెచ్చిపోయిన రోహిత్..

రామానందనాకు బెయిల్ వస్తుందా..?

రవితేజ రేంజికి తగ్గట్టే రెమ్యునరేషన్ పారితోషికంలో మాత్రం తగ్గేదేలే!

Viral: కదులుతున్న రైలు ఎక్కబోయి.. చివరికి ఏం జరిగిందంటే?

GOLD: నిన్న, మొన్న తగ్గినదానికంటే ఇవాళ ఒక్కరోజులోనే..

Bowenpally: పొట్టు.. పొట్టు కొట్టుకున్న బీఆర్ఎస్, కాంగ్రెస్ నేతలు

టెట్ అర్హత లేని టీచర్లను నియమించొద్దు సుప్రీంకోర్టు సంచలన ఆదేశాలు

జబర్దస్త్ నరేష్ జీవితంలో ఎన్నో మలుపులు.. వెనుక అసలు కథ..!

నాకు ఏం సంబంధం లేదు కన్నీళ్లు పెట్టుకున్న శ్యామ్ ఇన్స్టిట్యూట్ డైరెక్టర్

Photos

+5

దువాతో రణ్‌వీర్‌ సింగ్‌, దీపికా పదుకొణె.. వైరల్‌గా ఫ్యామిలీ (ఫొటోలు)

+5

అందాల ఆషిక.. చీరలో ఆకట్టుకుందిలా..(ఫొటోలు)

+5

అబు జాని 40 సంవత్సరాల ఈవెంట్‌...మెరిసిన ప్రముఖులు (ఫొటోలు)

+5

‘ఎపిక్ ’మూవీ.. హీరోయిన్ వైష్ణవి చైతన్య (ఫొటోలు)

+5

'సర్దార్ 2'ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో మెరిసిన.. మాళవిక మోహనన్ (ఫొటోలు)

+5

నల్ల చీరలో మైమరిపించే అందంతో ప్రియా ప్రకాష్ వారియర్..(ఫొటోలు)

+5

చిన్న వయసులోనే సంచలనాలు.. కెప్టెన్‌గా ఎదిగిన గిల్ అరుదైన (ఫొటోలు)

+5

కార్తి 'సర్దార్ 2'ప్రీ రిలీజ్ ఈవెంట్..(ఫొటోలు)

+5

గోల్డ్ డ్రెస్‌లో మెరిసిపోతున్న అమితాబ్ మనవరాలు (ఫోటోలు)

+5

అప్సరసగా అందాల రాశీ ..(షూటింగ్‌ ఫొటోస్‌)