Breaking News

Bihar Election: సింగర్‌ మైథిలి ఠాకూర్‌ ముందంజ

Published on Fri, 11/14/2025 - 08:54

అలీనగర్: బీహార్‌ అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్‌ జరుగుతోంది. ఫలితాలు రౌండ్‌ల వారీగా  వెల్లడి కానున్నాయి. తాజా సమాచారం ప్రకారం బీహార్‌లోని దర్భంగా జిల్లాలోని జనరల్ నియోజకవర్గం అలీనగర్‌ నుంచి ఎన్నికల బరిలోకి దిగిన జానపద గాయని, బీజేపీ సాంస్కృతిక రాయబారి మైథిలి ఠాకూర్‌ తొలి ఫలితాల్లో ముందంజలో ఉన్నారు.

బీహార్‌లోని దర్భంగా జిల్లాలోని అలీనగర్‌లో చాలా ఏళ్లుగా ఎన్నికల్లో హోరాహోరీ పోటీ ఏర్పడుతోంది. ఈసారి ఇక్కడి నుంచి బీజేపీ తరపున బరిలోకి దిగిన జానపద గాయని  మైథిలి ఠాకూర్‌పై అందరి దృష్టి నిలిచింది. ఆమె  అలీనగర్ నుండి రాజకీయ అరంగేట్రం చేస్తున్నారు. 25 ఏళ్ల మైథిలి ఠాకూర్‌ను ఎన్నికల బరిలోకి దింపడం ద్వారా బీజేపీ ఇక్కడ సునాయాస విజయం సాధించేందుకు ప్లాన్‌ చేసింది. మైథిలి ఠాకూర్‌పై ఆర్జేడికి చెందిన వినోద్ మిశ్రా పోటీ పడుతున్నారు. మైథిలి ఠాకూర్ తన ఎన్నికల అఫిడవిట్‌లో దాదాపు రూ.4 కోట్ల విలువైన ఆస్తులను కలిగి ఉన్నట్లు వెల్లడించారు. ఆమె వార్షిక ఆదాయం ఐదు సంవత్సరాలలో రూ.12.02 లక్షల నుండి రూ.28.67 లక్షలకు పెరిగిందని తెలిపారు. 2025 బీహార్ అసెంబ్లీ ఎన్నికలు రెండు దశల్లో నవంబర్ 6, 11 తేదీలలో జరిగాయి. నేడు (నవంబర్ 14) కౌంటింగ్ జరుగుతోంది.
 

Videos

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

ఎన్నికలు సజావుగా జరిగితే విజయం మాదే..

దసరాకి RC ఫాన్స్ కు అదిరిపోయే న్యూస్..!

హైకోర్టులో YSRCP పిటిషన్.. పొన్నవోలు వాదనలు

అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో అయ్యన్నపాత్రుడికి షాక్

కడపలో ఉద్రిక్తత నామినేషన్ పత్రాలు చించివేత

YSRCP నేతలు నామినేషన్లు వేయకుండా TDP మూకల దాడి

Photos

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)