Breaking News

బీజేపీ రాజ్య‌స‌భ ప‌క్ష‌నేత‌గా జేపీ న‌డ్డా!

Published on Fri, 06/21/2024 - 16:22

బీజేపీ పార్టీ సీనియర్  నేత‌, కేంద్ర ఆరోగ్య మంత్రి జేపీ నడ్డా రాజ్యసభలో పార్టీ  ప‌క్ష నేత‌గా ఎంపికైన‌ట్లు తెలుస్తోంది. మ‌రోవైపు బీజేపీ జాతీయ అద్య‌క్షుడి ప‌ద‌విలోనూ కొంత‌కాలం పాటు ఆయన కొన‌సాగ‌నున్నారు. కాగా  ప్ర‌ధాని సొంత రాష్ట్రం గుజరాత్ నుంచి కేంద్ర మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రితోపాటు ర‌సాయనాలు-ఎరువుల మంత్రిత్వ శాఖ బాధ్యతలు అప్ప‌గించారు.

2020లో ప్రస్తుత కేంద్ర హోం మంత్రి అమిత్ షా నుంచి పార్టీ జాతీయ అధ్య‌క్షుడి బాధ్యతలు స్వీకరించారు. ప్రస్తుతం కేంద్ర మంత్రిత్వ శాఖ‌ ద‌క్క‌డంతో నడ్డా.. బీజేపీ జాతీయ అధ్యక్ష పదవికి రాజీనామా చేస్తారని ఊహాగానాలు వచ్చాయి. కానీ ఆయ‌న రాజీనామా చేయ‌లేదు. బీజేపీ అగ్ర సంస్థాగత నేతగా కొనసాగుతున్నారు.

అన్ని రాష్ట్రాల్లో 50 శాతం సంస్థాగత ఎన్నికలు పూర్తయిన తర్వాతే జాతీయ అధ్యక్షుడిని ఎన్నుకోనున్నారు. ఇది జ‌ర‌గ‌డానికి దాదాపు ఆరు నెలల స‌మ‌యం ప‌డుతుంది. కాబట్టి కొత్త అధ్యక్షుడిని డిసెంబర్-జనవరిలో జ‌ర‌గ‌వ‌చ్చు.

ఇక న్యాయశాస్త్రంలో పట్టా పొందిన నడ్డా, ABVP  కార్య‌క‌ర్తగా త‌న రాజకీయ ప్రయాణాన్ని ప్రారంభించారు. 1991లో పార్టీ యువజన విభాగం, భారతీయ జనతా యువ మోర్చా నాయకుడిగా ఎదిగారు. 2012లో తొలిసారిగా హిమాచల్ ప్రదేశ్ నుంచి రాజ్యసభకు ఎన్నికయ్యారు. 2014లో అమిత్ షా పార్టీ అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించినప్పుడు బీజేపీ పార్లమెంటరీ బోర్డు సభ్యునిగా ఎంపికయ్యారు.

గతంలో హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీలో ఎమ్మెల్యేగా కూడా పనిచేశాడు; బిలాస్‌పూర్ నుంచి మూడుసార్లు (1993, 1998, 2007) గెలుపొందారు. 1998 -2003 మధ్య ఆరోగ్య మంత్రిగా పనిచేశారు. ఈ ఏడాది ఏప్రిల్‌లో గుజరాత్‌ నుంచి రాజ్యసభ ఎంపీగా ఎన్నికయ్యారు.

Videos

లోకేష్ కు బుర్ర పనిచేయడం లేదు..! మిథున్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

బాబుకు హైకోర్టు షాక్.. బండి దీప్తి సంచలన కామెంట్స్

ఎమ్మెల్యే మాధవిరెడ్డి భర్త ఛాలెంజ్.. ఇచ్చిపడేసిన కడప YSRCP నేతలు

ఈ రోజు కరకట్టలో కూర్చొని ముసిముసి నవ్వులు నవ్వొచ్చు.. రేపు అనేది మీ ఊహకే వదిలేస్తున్నాం

మా కార్యకర్తలను చంపడానికా ఈ ఎలక్షన్ లు పెట్టారు.. SECని నిలదీసిన YSRCP నేతలు

టీడీపీ గూండాల దాడిపై వైఎస్ జగన్ ప్రెస్ మీట్

నామినేషన్లపై పెద్దిరెడ్డి సంచలన కామెంట్స్

దాండియా వేడుకల్లో విషాదం.. విద్యార్థిని మృతి, పలువురికి గాయాలు

ముళ్ల కంచెలతో దిగ్బంధం.. పోలీస్ Vs వైఎస్ఆర్ సీపీ

ఏపీలో రాష్ట్రపతి పాలన?

Photos

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)