Breaking News

కోల్‌కతా ఘటన: సందీప్‌ ఘోష్‌ పాత్రపై కొత్త ఆరోపణ!

Published on Thu, 09/05/2024 - 18:41

కోల్‌కతా: కోల్‌కతా ఆర్జీ కర్‌ హాస్పిటల్‌లో జూనియర్‌ డాక్టర్‌ హత్యాచార ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది.​ ఈ కేసులో విచారణ ఎదుర్కొంటున్న ఆర్జీ కర్‌ హాస్పిటల్‌ మాజీ ప్రిన్సిపల్ సందీప్‌ఘోష్‌పై బెంగాల్ బీజేపీ చీఫ్ సుకాంత మజుందార్ తాజాగా తీవ్రమైన ఆరోపణలు చేశారు.  మరుసటి హత్యాచారం జరిగిన సెమినార్‌ హాల్‌ వద్ద మరమత్తు పనులు జరిపించాలని సందీప్‌ ఘోష్‌ ఆదేశాలు జారీచేశారని అన్నారు. దానికి సంబంధించిన ఓ ఆర్డర్‌ లెటర్‌ను సైతం విడుదల చేశారాయన.

‘‘ఆగస్ట్‌ 10వ తేదీన ఈ ఆర్డర్‌పై ఆర్జీ కర్‌ హాస్పిటల్‌ మాజీ ప్రిన్సిపల్‌ సందీప్‌ ఘోష్‌ సంతకం చేశారు. అంటే కేవలం జూనియర్‌ డాక్టర్‌ మృతిచెందిన మరుసటి రోజే. ఈ ఆర్డర్‌ను పరిశీలిస్తే.. మరిన్ని అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.   క్రైం సీన్‌లోని  ఆధారాలను తారుమారు చేశారని ఇప్పటికే ఆర్జీ కర్‌ ఆస్పత్రిలోని డాక్టర్లు, నిరసన తెలిపే వైద్య సిబ్బంది ఆరోపణలు చేస్తున్నారు. అయితే ఈ ఆరోపణలను మాత్రం పోలీసులు కమిషనర్ ఖండించారు’’అని తెలిపారు.

‘‘ ఆర్జీ కర్‌  హాస్పిటల్‌లోని వివిధ విభాగాలలో ఆన్-డ్యూటీ  డాక్టర్ల గదులు, ప్రత్యేక అటాచ్డ్ టాయిలెట్లలో మరమత్తు పనులు చేయవల్సిందిగా కోరుతున్నా. రెసిడెంట్స్ డాక్టర్ల డిమాండ్ మేరకు అవసరమైన పనులుచేయండి’’ అని సందీప్‌ ఘోష్‌ పీడబ్ల్యూడీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లకు రాసిన లేఖలో ఉండటం గమనార్హం.

మరోవైపు..మృతురాలి తల్లిదండ్రులు రాష్ట్ర పోలీసులపై సంచలన ఆరోపణలు చేశారు. ఈ కేసును అణిచివేసేందుకు పోలీసులు తమకు లంచం ఇవ్వాలని చూశారని ఆరోపించారు. కేసును తప్పుదోవ పట్టించేందుకు పోలీసులు ప్రయత్నించారని, సమగ్ర దర్యాప్తు లేకుండా కేసును మూసివేయడానికి యత్నించారని మండిపడ్డారు.

Videos

జియో IPO సంచలనం

బాబుకు దిమ్మతిరిగేలా.. పక్కా ఆధారాలతో SECకి ఫిర్యాదు

రెండో టీ20లో భారత మహిళా జట్టు విజయం

లోపల పసుపు..పైన ఖాకీ.. కోయ ప్రవీణ్ కుమార్ వ్యాఖ్యలపై వెంకట్ రెడ్డి సంచలన కామెంట్స్

టీడీపీకి రెబల్స్ టెన్షన్.. టికెట్లు దక్కక రెబల్స్ గా బరిలోకి!

మా ప్రభుత్వం వచ్చాక మొదటి ఆరు నెలలు నేనే హోం మంత్రి!

వల్లభనేని వంశీ సమక్షంలో టీడీపీ నుండి YSRCP లోకి భారీ చేరికలు

జగన్ అంటే బాబుకు వణుకు.. చేతకానప్పుడు ఓవర్ యాక్షన్ ఎందుకు?

ఈ రోజు కుట్రలు చేసి గెలవొచ్చు... రేపు గెలిచిన ప్రతి ఒక్కరు మీ అంతటా మీరే రాజీనామా చేసేలా..

రాయచోటిలో ఇది చీకటి రోజు.. గడికోట శ్రీకాంత్ రెడ్డి వార్నింగ్

Photos

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం...జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)