Breaking News

జేకేలో రాజ్యసభ ఎన్నికలు.. ముగ్గురు అభ్యర్థులను ప్రకటించిన బీజేపీ

Published on Sun, 10/12/2025 - 13:39

న్యూఢిల్లీ: ఈనెల (అక్టోబర్) 24న జమ్ముకశ్మీర్‌లోని నాలుగు రాజ్యసభ స్థానాలకు జరిగే ఎన్నికలకు సంబంధించి బీజేపీ ముగ్గురు అభ్యర్థుల పేర్లను ఆదివారం వెల్లడించింది. వీరిలో జమ్ముకశ్మీర్ యూనిట్ అధ్యక్షుడు సత్ పాల్ శర్మ ఒకరు. జేకేలో జరగనున్న 2025 ద్వైవార్షిక రాజ్యసభ ఎన్నికలకు భారతీయ జనతా పార్టీ కేంద్ర ఎన్నికల కమిటీ మూడు వేర్వేరు నోటిఫికేషన్ల కింద ఆమోదం తెలిపిందని జాతీయ ప్రధాన కార్యదర్శి, ప్రధాన కార్యాలయ ఇన్‌చార్జ్ అరుణ్ సింగ్ ఒక ప్రకటనలో తెలిపారు.

అభ్యర్థుల జాబితాలో సత్ పాల్ శర్మతో పాటు గులాం మొహమ్మద్ మీర్, రాకేష్ మహాజన్ ఉన్నారు. నాలుగు స్థానాలకు ఎన్నికల కోసం ఎన్నికల కమిషన్ మూడు వేర్వేరు నోటిఫికేషన్‌లను జారీ చేసింది. నేషనల్ కాన్ఫరెన్స్-కాంగ్రెస్ కూటమికి మూడు స్థానాల్లో ఆధిక్యం ఉండగా, అసెంబ్లీలో వారి బలం ఆధారంగా బీజేపీకి ఒక స్థానం ఉంది. శుక్రవారం జమ్ముకశ్మీర్‌లోని అధికార నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీ రాజ్యసభ ఎన్నికలకు ముగ్గురు అభ్యర్థుల పేర్లను ప్రకటించింది. వారిలో చౌదరి ముహమ్మద్ రంజాన్, సజాద్ కిచ్లూ, షమీ సింగ్ ఒబెరాయ్ ఉన్నారు. మరో స్థానానికి కాంగ్రెస్‌తో చర్చలు జరుగుతున్నాయని సమాచారం.
 

రాజ్యసభ ఎన్నికలకు నామినేషన్ పత్రాలు దాఖలు చేయడానికి చివరి తేదీ అక్టోబర్ 13. 2021, ఫిబ్రవరి నుండి ఖాళీగా ఉన్న స్థానాలకు  అక్టోబర్ 24న ఎన్నికలు జరగనుండగా, అదే రోజున కౌంటింగ్ కూడా జరగనుంది. జమ్ముకశ్మీర్ అసెంబ్లీలో ప్రస్తుతం 88 మంది సభ్యులున్నారు. ఎన్‌సీ-కాంగ్రెస్ సంకీర్ణ భాగస్వామ్యంలో 52 మంది సభ్యులు, బీజేపీ 28, పీడీపీ 3, పీపుల్స్ కాన్ఫరెన్స్‌ ఒకరు, అవామి ఇత్తెహాద్ పార్టీలో ఒకరు, ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్‌) ఒకరు, మరో ఇద్దరు స్వతంత్ర సభ్యులు ఉన్నారు.
 

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)