Breaking News

కేజ్రీవాల్‌ ప్లాన్‌, సిసోడియా హత్యకు కుట్ర చేస్తున్నారా?: బీజేపీ నేత సంచలన వ్యాఖ్యలు

Published on Thu, 03/09/2023 - 16:38

న్యూఢిల్లీ: మద్యం విధానం కేసులో అరెస్టైన ఢిల్లీ మాజీ ఉప ముఖ్యమంత్రి, ఆప్‌ నేత మనీశ్‌ సిసోడియా ప్రస్తుతం తిహార్‌ జైల్లో ఉన్నారు. అయితే ఆయనకు ప్రాణ హాని ఉందని ఆమ్ ఆద్మీ పార్టీ ఆందోళన వ్యక్తం చేసింది. తాజాగా ఈ ఆరోపణలపై బీజేపీ నేత ఎంపీ మనోజ్ తివారీ ఘాటుగా బదులిచ్చారు. ఢిల్లీ జైళ్లు ఢిల్లీ ప్రభుత్వ పరిధిలోకే వస్తాయని, మరి సిసోడియా ప్రాణాలకు ఎవరి నుంచి ముప్పు ఉంటుందని ఎదురు ప్రశ్నించారు.

సిసోడియా ప్రాణహాని.. వాళ్ల నుంచేనా
ఈ అంశంపై తివారీ మాట్లాడుతూ.. “ఢిల్లీ మద్యం పాలసీ కుంభకోణం విషయంలో మంత్రి మనీష్ సిసోడియా అరెస్టు తర్వాత, అవినీతిపరులలో భయాందోళనలు నెలకొన్నాయి. ఇంత కాలం అవినీతిపరులని తిట్టిన కేజ్రీవాల్ ప్రస్తుతం అవినీతిపరులను ఆలింగనం చేసుకుంటున్నారు. జైలులో మనీష్ సిసోడియా ప్రాణాలకు ప్రమాదం ఉందని ఆమ్ ఆద్మీ పార్టీ చెబుతోంది, అయితే ఢిల్లీ జైలు ఢిల్లీ ప్రభుత్వం అధీనంలో ఉంది. మరి మనీష్ సిసోడియాకి ప్రాణ హాని బీజేపీ నుంచి ఎలా ఉంటుంది.  అరవింద్ కేజ్రీవాల్ రహస్యాలన్నీ ఆయనకు సన్నిహితుడైన మనీశ్ సిసోడియాకు బాగా తెలుసు.

మరి తన సీక్రెట్లు బయటపడకుండా సిసోడియాను చంపేందుకు కేజ్రీవాల్ కుట్ర పన్నుతున్నారా?’’ అని ప్రశ్నించారు. ‘‘ఢిల్లీ సర్కారు పరిధిలో ఉన్న జైలులో సిసోడియా ప్రాణాలకు ముప్పు ఎలా ఉంటుంది? బీజేపీ నుంచే ముప్పు ఉందంటూ అపోహలు కల్పించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. సిసోడియాకు గట్టి భద్రత ఇవ్వాలని తీహార్ జైలు అధికారులకు నేను విజ్ఞప్తి చేస్తున్నాను’’ అని ట్వీట్‌ ద్వారా ఈ విషయాలను పేర్కొన్నారు.

Videos

ఎవరివైపు పబ్లిక్? చాణక్య సర్వేలో క్లారిటీ!

ధనుష్ పార్టీకిలోకి TVK మంత్రి..?

DSC స్కామ్ బట్టబయలు లోకేష్ కి ఇచ్చిపడేసిన వరుదు కళ్యాణి

మళ్లీ భారీగా పెరిగిన బంగారం ఎంత పెరిగిందంటే..!

కొండా రాజీనామా! కొండా సురేఖ సంచలన నిర్ణయం

ఏ క్యారెట్ బంగారం కొంటే లాభం? పెరుగుతున్న బంగారం ధరలు

ఖర్చుకు భయపడి హైదరాబాద్ లో స్పిరిట్ షూటింగ్.. ఎక్కడంటే..?

ప్రారంభం రోజే పగుళ్లు.. పోలవరంపై పెను ప్రశ్నలు?

ఒక్క Rolex Watch తయారీకి ఎంత సమయం పడుతుంది?

అప్పుల్లో ఆల్ టైమ్ రికార్డును బద్దలు కొట్టేసిన బాబు

Photos

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)

+5

అందాల ముద్దుగుమ్మ ఆషిక రంగనాథ్ (ఫొటోలు)

+5

ప్రభాస్‌ని కలిసిన డై హార్డ్ ఫ్యాన్.. షర్ట్‌పై ఆటోగ్రాఫ్‌ తీసుకున్న యంగ్‌ హీరో (ఫోటోలు)