Breaking News

భారత రెజ్లర్లకు బీజేపీ ఎంపీ మద్దతు.. ‘ఒక మహిళగా అభ్యర్థిస్తున్నా’

Published on Fri, 06/02/2023 - 16:59

మహారాష్ట్రలో జరిగిన ఓ ప్రెస్ మీట్లో బీజేపీ ఎంపీ ప్రీతమ్ ముండే భారత రెజ్లర్ల వివాదంపై విచారణ జరుగుతున్న తీరుపై అసంతృప్తిని వ్యక్తం చేశారు. గత కొంతకాలంగా భారత రెజ్లర్లు భారత రెజ్లింగ్ సమాఖ్య అధ్యక్షుడు ఎంపీ బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్కు వ్యతిరేకంగా నిరసనలు తెలియజేస్తున్న విషయం తెలిసిందే. దేశవ్యాప్తంగా ఈ సంఘటన సంచలనం సృష్టించింది. అయినా కూడా ఈ కేసులో విచారణ నత్తనడకన సాగడం దురదృష్టకరమని ప్రీతమ్‌ ముండే ఆవేదన వ్యక్తం చేశారు. ఎంపీగా కాకుండా ఒక మహిళగా విచారణ వేగవంతం చేయమని కోరుతున్నానని తెలిపారు.  

పెరుగుతోన్న వ్యతిరేకత... 
భారత రెజ్లింగ్ సమాఖ్య అధ్యక్షుడు ఎంపీ బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ తమను లైంగికంగా వేధిస్తున్నారంటూ భారత రెజ్లర్లు చేస్తోన్న నిరసన రోజురోజుకీ ఉధృత రూపం దాల్చుతోంది. స్వయంగా సొంత పార్టీకి చెందినవారే బ్రిజ్  భూషణ్ కు వ్యతిరేకంగా మాట్లాడుతూ  ఉన్నారు. తాజాగా ఈ కోవలో మహారాష్ట్రకు చెందిన బీజేపీ ఎంపీ ప్రీతమ్ ముండే  చేరిపోయారు. 

విచారణ జరుగుతున్న తీరు విచారకరం... 
ఓ ప్రెస్ మీట్లో ప్రీతమ్ ముండే మాట్లాడుతూ.. ‘ఒక మహిళ నుంచి ఎటువంటి కంప్లైంట్ వచ్చినా ముందు విచారణ చేపట్టాలి. అలా చేయకుండా కాలయాపన చేయడం ప్రజాస్వామ్యానికి వ్యతిరేకం. ఇంతకాలం వారు కష్టపడి సాధించిన పతకాలను గంగానదిలో వేయడానికి సిద్దపడ్డారంటేనే వారు ఎంత వ్యధను అనుభవిస్తున్నారో నాకు అర్ధమవుతోంది.

వారి బాధను చూస్తుంటే గుండె తరుక్కుపోతోంది. నేను బీజేపీ ప్రభుత్వానికి చెందిన ప్రతినిధినే అయినా కూడా ఈ కేసులో విచారణ జరుగుతున్న తీరు పట్ల  విచారాన్ని వ్యక్తం చేస్తున్నాను. దయచేసి విచారణను వేగవంతం చేసి, వీలైనంత తొందరగా నిజానిజాలు తేల్చి వారికి న్యాయం చేయండి. ఒక ఎంపీగా కాకుండా ఒక మహిళగా అభ్యర్ధిస్తున్నాను’ అని అన్నారు.

చదవండి: పాకిస్తాన్, చైనాతో పోలిస్తే ఆ విషయంలో భారత్ చాలా బెటర్..

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)