బీజేపీ ఎంపీ సోదరికి వేధింపులు.. వెలుగులోకి మామ, మరిది అకృత్యాలు..

Published on Mon, 09/08/2025 - 09:01

లక్నో: ఉత్తరప్రదేశ్‌లో షాకింగ్‌ ఘటన వెలుగు చూసింది. ఏకంగా బీజేపీ ఎంపీ సోదరికే అత్తింటి వారి నుంచి వేధింపులు గురికావడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. అత్తగారి ఇంట్లో వారి అకృత్యాలు నిలదీసినందుకు మామ ఆగ్రహంతో ఊగిపోయారు. అనంతరం, ఆమెను వీధిలోకి లాగి తీవ్రంగా గాయపడ్డారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్టు పోలీసులు తెలిపారు.

వివరాల ప్రకారం.. యూపీలోని ఫరూఖాబాద్‌ ఎంపీ ముకేశ్‌ రాజ్‌పుత్‌ సోదరి రీనా సింగ్‌కు 17 ఏళ్ల క్రితమే వివాహం జరిగింది. దంపతులకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఇటా జిల్లాలో వీరంతా నివాసం ఉంటున్నారు. అయితే, ఆదివారం అనూహ్యం ఘటన చోటుచేసుకుంది. రీనా సింగ్‌ను తన మామ లక్ష్మణ్‌ సింగ్‌, తన భర్త సోదరులు కలిసి.. నడి వీధిలో దారుణంగా కొట్టారు. కర్రలతో చితకబాదారు. తనను కొట్టవద్దని ఎంత వారించినా.. ఆగ్రహంతో ఊగిపోయి దాడి చేశారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ మారింది. అనంతరం, తనపై జరిగిన దాడిపై రీనా సింగ్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. తన ఫిర్యాదులో సంచలన విషయాలను వెల్లడించారు. కొన్నేళ్లుగా తనను అత్తింటి వారు వేధింపులకు గురిచేస్తున్నారని ఆరోపించారు.

ఈ సందర్భంగా రీనా సింగ్‌ మాట్లాడుతూ.. ఆదివారం మధ్యాహ్నం నేను స్నానం చేస్తున్న సమయంలో మామ, తన మరిది కలిసి బాత్‌రూమ్‌ కిటికీ నుంచి ఫోన్‌లో వీడియోలు తీసే ప్రయత్నం చేశారు. నా పట్ల అనుచితంగా ప్రవర్తించారు. ఈ విషయమై నేను వారిని ప్రశ్నించడంతో నాపై దాడి చేశారు. నా కుమార్తెను కూడా దారుణంగా కొట్టారు. చాలా రోజులుగా నన్ను వేధింపులకు గురిచేస్తున్నారని ఆరోపించారు. దీంతో, రీనా సింగ్‌ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్టు పోలీసులు తెలిపారు. బాధితురాలు బీజేపీ ఎంపీ సోదరి కావడంతో ఈ ఘటన స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. 

Videos

పవన్ పై రగిలిపోతున్న జనసేన కేడర్...!

మిథున్ రెడ్డిపై హత్యాయత్నం.. కత్తులు, రాళ్లు, కర్రలతో కాన్వాయ్ పై దాడి

రామచంద్రాపురంలో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన టీడీపీ సీనియర్ నేతలు

అట్లాంటిక్ సముద్రం అడుగున పెను విధ్వంసం! శాస్త్రవేత్తల షాకింగ్ హెచ్చరిక!

చరణ్ సరసన సారా..!

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థుల జాబితా విడుదల

మొదలైన కూటమి కుట్రలు.. YSRCP అభ్యర్థి కొడుకుని తీసుకెళ్లిన పోలీసులు

ఆర్టీసీని చంపేందుకు కుట్ర.. ప్రభుత్వం తీరుపై ఆర్టీసీ జేఏసీ ఫైర్

కాంగ్రెస్ అధిష్టానానికి మంత్రి దామోదర బిగ్ షాక్

అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం..చిన్నారులు మృతి

Photos

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)

+5

సందీప్ కిషన్ కొత్త సినిమా 'కరికాల' సినిమా ప్రారంభోత్సవం (ఫొటోలు)