బీజేపీకి సీనియర్‌ నేత గుడ్‌బై.. కాషాయ పార్టీలో ఏం జరుగుతోంది?

Published on Tue, 03/21/2023 - 16:07

బెంగళూరు: అసెంబ్లీ ఎన్నికల వేళ కర్నాటకలో బీజేపీకి ఎదురుదెబ్బ తగిలింది. సీనియర్‌ నేత, ఎమ్మెల్సీ బాబురామ్‌ చించనసూర్.. బీజేపీకి రాజీనామా చేశారు. ఇక, మరికొద్ది రోజుల్లో కాంగ్రెస్‌లో చేరేందుకు ముహుర్తం ఫిక్స్‌ అయినట్టు తెలుస్తోంది. అయితే, నెల రోజుల వ్యవధిలో ఇద్దరు బీజేపీ నేతలు కాషాయ పార్టీకి గుడ్‌ బై చెప్పడం చర్చనీయాంశంగా మారింది. 

వివరాల ప్రకారం.. బీజేపీ ఎమ్మెల్సీ బాబూరావ్ చించనసూర్ రాజీనామా చేశారు. ఈ క్రమంలో తన రాజీనామా లేఖను శాసన మండలి చైర్మెన్ బసవరాజ్ హొరట్టికి సమర్పించారు. అయితే, రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో బాబూరావు ప్రత్యక్ష ఎన్నికల్లో పాల్గొనాలని(ఎమ్మెల్యే) నిర్ణయించుకున్నారు. ఈ విషయాన్ని అధిష్టానం దృష్టికి తీసుకెళ్లడంతో ఆయన నిర్ణయానికి నో చెప్పడంతో పార్టీని వీడినట్టు తెలుస్తోంది. ఈనెల 25వ తేదీని బాబూరావ్‌.. కాంగ్రెస్‌లో చేరనున్నట్టు తెలుస్తోంది.  

ఇదిలా ఉండగా కొద్దిరోజుల క్రితమే బీజేపీ నేత పుట్టన్న కాషాయ పార్టీని వీడారు. అనంతరం, కాంగ్రెస్‌ పార్టీలో చేరారు. ఈ సందర్బంగా కర్నాటకలో బస్వరాజు బొమ్మై సర్కారుపై తీవ్ర ఆరోపణలు చేశారు. బొమ్మై ప్రభుత్వంలో పెద్ద ఎత్తున అవినీతి జరిగిందని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇక, మరో మూడు నెలల్లో కర్నాటకలో అసెంబ్లీ ఎన్నికలు జరిగే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో కర్నాటకలో కాంగ్రెస్‌, జేడీఎస్‌ జోరుగా ప్రచారానికి ప్లాన్‌ చేస్తున్నాయి. 

ఇది కూడా చదవండి: కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలకు... 80 మందితో ఆప్‌ జాబితా

Videos

వృద్ధుడిని కూడా వదలరా? సొంత పార్టీ నేతలపై టీడీపీ గూండాల దాడులు

26నుంచి భారీ వర్షాలు

మహిళల జుట్టు పట్టుకోవడం, చీరలు లాగడం ఏ రకమైన పాలనకు నిదర్శనం?

దాడుల వెనుక టార్గెట్.. రెడ్డి వర్గం..! ఇంద్రనీల్ సంచలన నిజాలు

ముంచుకొస్తున్న అర్ణబ్ తుపాను

ఎల్లో మూకలపై శివంగుల్లా తిరగబడ్డ మహిళలే మాకు స్ఫూర్తి

నేడు భారత్ -న్యూజిలాండ్ మధ్య రెండో T20 మ్యాచ్

జగనన్న మళ్లీ వస్తేనే రాష్ట్రంలో మహిళలకు రక్షణ

2029 నీకు పుట్టగతులు ఉండవ్..! పరిటాల సునీతకు గోరంట్ల మాస్ వార్నింగ్

నా సర్వీసులో ఇలాంటి ఎన్నికలు ఎప్పుడూ చూడలేదు

Photos

+5

ఆస్ట్రేలియాలో ఎంజాయ్ చేస్తున్న కాయదు లోహర్ (ఫొటోలు)

+5

'ఇడుపు కాయితం' గడప సాంగ్.. మూవీ రిలీజ్ ఎప్పుడంటే?(ఫొటోలు)

+5

పెళ్లి బంధానికి నాలుగేళ్లు.. పూర్ణ ఫ్యామిలీ (ఫొటోలు)

+5

'మా అన్నయ్య బంగారం'.. ప్రభాస్ బర్త్ డే క్యూట్ ఫొటోస్

+5

'మిస్టర్ దెయ్యం' సినిమా లాంచ్ (ఫొటోలు)

+5

వైట్ శారీలో టాలీవుడ్ అందాల భామ ఈషా రెబ్బా కొత్త ఫోటోలు

+5

‘అక్క’ ట్రైలర్‌ లాంచ్‌లో మెరిసిన హీరోయిన్‌ కీర్తి సురేశ్‌ (ఫొటోలు)

+5

గజరాజులు తిరుగు ప్రయాణం... నగరవాసుల భావోద్వేగం

+5

'ఐఫా'అవార్డుల విలేకరుల సమావేశంలో బాలీవుడ్ నటులు సందడి (ఫొటోలు)

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా సద్దుల బతుకమ్మ (ఫొటోలు)