Operation Sindoor: పారిపోండ్ర బాబు.. బతికుంటే మళ్లీ కలుద్దాం
Breaking News
పోలీస్ స్టేషన్‌లో ఎమ్మెల్యే హల్‌చల్.. వీడియో వైరల్
Published on Sat, 04/02/2022 - 18:12
పాట్నా: ఆయనో ఎమ్మెల్యే.. అధికారం ఉంది కదా అని.. పోలీస్ స్టేషన్‌లో హల్‌చల్ చేశాడు. పోలీస్ స్టేషన్‌లోని అధికారి సీటులో కూర్చుని ఓ కేసు గురించి వాకబు పోలీసులకే వార్నింగ్ ఇచ్చిన వీడియో సోషల్ మీడియాలో ట్రెండింగ్ అవుతోంది.
వివరాల ప్రకారం.. బీహార్‌లో బీజేపీ ఎమ్మెల్యే మురారి మోహన్ ఝా.. గత వారం ఆయన తన నియోజకవర్గానికి వెళ్లిన క్రమంలో పోలీసులు ఇద్దరు వ్యక్తులను కొట్టిన ఘటన గురించి తెలుసుకున్నారు. ఈ నేపథ్యంలో ఈ కేసు గురించి వాకబు చేసేందుకు దర్భంగా జిల్లాలోని కియోటి పోలీస్ స్టేషన్‌కు వెళ్లారు. ఈ క్రమంలో సదరు ఎమ్మెల్యే డైరెక్ట్‌గా ఎస్‌హెచ్ఓ కుర్చీలో కూర్చుని కేసుకు సంబంధించిన ఫైల్ తనిఖీ చేశారు.
ఆ సమయంలో స్టేషన్‌లో జర్నలిస్టులు, ప్రజలు ఉన్నారని స్టేషన్ డైరీని బహిరంగంగా తాను చూపలేనని ఎస్‌హెచ్ఓ.. ఎమ్మెల్యేకు నచ్చజెప్పే ప్రయత్నం చేయగా ఆయన అదేదీ పట్టించుకోకుండా స్టేషన్‌లో బెదిరింపులకు పాల్పడుతూ హల్ చల్ చేశారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియోపై తేజస్వీ యాదవ్ స్పందిస్తూ.. ఎన్‌డీఏ ప్రభుత్వం బీహార్‌లో సర్కస్‌ను నడుపుతోందని సీఎం నితీష్ కుమార్‌పై సెటైర్లు విసిరారు.
स्टेशन डायरी गायब मिली तो बीजेपी विधायक ने SHO की क्लास लगा दी... वीडियो दरभंगा का है जहां विधायक मुरारी मोहन झा निरीक्षण करने पहुंचे थे#Darbhanga #SHO #MurariMohanJha #ViralVideo pic.twitter.com/4yjUszLcfA
— Gourav Sharma (@hindgourav) April 2, 2022
Tags : 1