Breaking News

కర్ణాటకలో కలకలం.. గాలి జనార్ధన్ రెడ్డి ఇంటికి నిప్పు..

Published on Sat, 01/24/2026 - 08:51

బెంగళూరు: కర్ణాటకలో మరో షాకింగ్‌ ఘటన చోటుచేసుకుంది. బీజేపీ ఎమ్మెల్యే గాలి జనార్ధన్ రెడ్డి ఇంటికి గుర్తు తెలియని దుండగులు నిప్పు అంటించారు. బళ్లారిలోని కంటోన్మెంట్ ఏరియాలో ఈ ఘటన జరిగింది. అయితే, ఈ ఘటన సమయంలో ఇంట్లో ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. ఈ ఘటన కర్ణాటకలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.

ఈ ప్రమాదానికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. బళ్లారిలోని బీజేపీ ఎమ్మెల్యే గాలి జనార్ధన్ రెడ్డి మోడల్ హౌస్‌కు గుర్తు తెలియని దుండగులు నిప్పంటించారు. బళ్లారి శివార్లలో రూ.3 కోట్ల విలువైన గాలి జనార్దన్ రెడ్డి మోడల్ హౌస్‌కు నిప్పుపెట్టడం తీవ్ర చర్చకు దారి తీసింది. దుండగులు ఇంటి.. కిటికీలు, తలుపులు పగులగొట్టి పెట్రోల్ పోసి దహనం చేయడంతో ఫర్నిచర్ కాలిపోయింది. అయితే, ఈ ఘటన వెనుక బళ్లారి కాంగ్రెస్ ఎమ్మెల్యే నారా భరత్ రెడ్డి ఉన్నారని గాలి జనార్ధన్‌ రెడ్డి సోదరుడు సోమశేఖర్ రెడ్డి ఆరోపించారు. కాగా, ఇంటి నిప్పు పెట్టిన సమయంలో జనార్థన్‌ రెడ్డి ఇంట్లో ఎవరూ లేకపోవడంతో పెను ‍ప్రమాదం తప్పింది. కర్ణాటక అసెంబ్లీ సమావేశాల నేపధ్యంలో గాలి జనార్థన్‌ రెడ్డి బెంగళూరులో ఉన్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు తెలిపారు.

 

కాగా, జనవరి ఒకటో తేదీన గాలి జనార్ధన్ రెడ్డి ఇంటి వద్ద కాంగ్రెస్‌ ఎమ్మెల్యే నారా భరత్ రెడ్డి వర్గీయులు కాల్పులకు తెగబడిన విషయం తెలిసిందే. ఆ ఘటనపై విచారణ జరుగుతుండగానే బళ్లారిలోని గాలి జనార్ధన్ రెడ్డి మోడల్ హౌస్‌కు నిప్పు పెట్టడంపై సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్‌ ప్రభుత్వంపై స్థానిక బీజేపీ నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 

Videos

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)