Breaking News

రాయ్‌బరేలీ బీజేపీ లోక్‌సభ అభ్యర్థి కుమార్‌ విశ్వాస్‌?

Published on Sat, 03/02/2024 - 06:53

కాంగ్రెస్‌లోని గాంధీ కుటుంబానికి కంచుకోటగా ఉన్న యూపీలోని రాయ్‌బరేలీ లోక్‌సభ స్థానం నుంచి బీజేపీ ఈసారి బ్రాహ్మణ అభ్యర్థిని బరిలోకి దింపాలని యోచిస్తున్నదని సమాచారం. ఈ నేపధ్యంలో బీజేపీ అభ్యర్థులుగా కుమార్ విశ్వాస్, బీజేపీ మాజీ జాతీయ అధికార ప్రతినిధి నుపుర్ శర్మ, జాతీయ అధికార ప్రతినిధి సుధాన్షు త్రివేది, ఎస్పీ ఎమ్మెల్యే మనోజ్ పాండే పేర్లు  వినిపిస్తున్నాయి. 

రాయ్‌బరేలీ, అమేథీలను యూపీలో కాంగ్రెస్‌కు కంచుకోటలుగా పరిగణిస్తారు. అయితే 2019లో అమేథీ నుంచి బీజేపీ తన అభ్యర్థిగా స్మృతి ఇరానీని పోటీకి దింపి, కాంగ్రెస్‌ కంచుకోటను బద్దలుకొట్టింది. రాయ్‌బరేలీ స్థానాన్ని సొంతం చేసుకునేందుకు బీజేపీ గత రెండేళ్లుగా ప్రయత్నాలు సాగిస్తోంది. ఇదేస్థానం నుంచి కాంగ్రెస్ మహిళా నేత ప్రియాంక గాంధీ వాద్రా పోటీ చేస్తారనే చర్చ జరుగుతోంది. ఈ నేపధ్యంలో బీజేపీ రాయ్‌బరేలీ నుంచి ప్రముఖుడిని రంగంలోకి దింపేందుకు సిద్ధ‌మైంది.

కుమార్ విశ్వాస్ 2014లో ఆమ్ ఆద్మీ పార్టీ టిక్కెట్‌పై అమేథీ నుంచి పోటీ చేశారు. విశ్వాస్‌ను ఎన్నికల్లో దింపడం ద్వారా బలమైన పోటీ  ఇవ్వవచ్చని బీజేపీ భావిస్తోంది. దీనికితోడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న కుమార్ విశ్వాస్ ప్రసంగం ఆయన బీజేపీ నుంచి ఎన్నికల్లో పోటీ చేస్తారని సూచనలిస్తోంది. ఇటీవల ప్రధాని మోదీ ద్వారకలో పర్యటించినప్పుడు ఆయనను కుమార్‌ విశ్వాస్‌ ప్రశంసించారు.

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)