Breaking News

బీజేపీ కొత్త అధ్యక్షుడి ఎన్నిక ఫిబ్రవరిలో

Published on Wed, 12/18/2024 - 04:55

న్యూఢిల్లీ: భారతీయ జనతా పార్టీకి కొత్త అధ్యక్షుడి ఎన్నిక ఫిబ్రవరిలో జరుగుతుందని పార్టీలోని విశ్వసనీవర్గాలు వెల్లడించాయి. జేపీ నడ్డా నుంచి కొత్త అధ్యక్షుడు ఫిబ్రవరిలో పగ్గాలు చేపడతారని వెల్లడించాయి. సగం కంటే ఎక్కువ రాష్ట్రాల్లో సంస్థాగత ఎన్నికలు జనవరి మధ్యకల్లా పూర్తవుతాయని, తదుపరి జాతీయ అధ్యక్షుడి ఎన్నిక ఉటుందని వివరించాయి. 60 శాతం రాష్ట్రాల్లో పార్టీ అధ్యక్షుల పదవీకాలం ముగిసిందని, వీరి స్థానాల్లో .జనవరి మధ్యకల్లా కొత్త అధ్యక్షులు ఎన్నికవుతారని తెలిపాయి. 

కొత్త జాతీయ అధ్యక్షుడిని ఎన్నుకోవాలంటే.. సగం రాష్ట్రాల్లో పార్టీ సంస్థాగత ఎన్నికలు పూర్తికావాలని బీజేపీ నిబంధనావళి చెబుతోంది. మంత్రివర్గంలో నుంచి ఒకరిని కొత్త అధ్యక్షుడిగా ఎన్నుకుంటారా అని ప్రశ్నించగా.. మంత్రి కావొచ్చు లేదా పార్టీలో ఒకరు కావొచ్చు.. అని విశ్వసనీయవర్గాలు పేర్కొన్నాయి. కొత్త అధ్యక్షుడెవరనే విషయంలో ఇంకా ఏదీ ఖరారు కాలేదని వివరించాయి. ప్రస్తుతం బీజేపీ అధ్యక్షుడిగా ఉన్న కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి జేపీ నడ్డా 2020 ఫిబ్రవరిలో పార్టీ పగ్గాలు చేపట్టారు. సాధారణంగా అధ్యక్షుడికి మూడేళ్ల కాలపరిమితి ఉంటుంది. అయితే లోక్‌సభ ఎన్నికల దృష్ట్యా నడ్డాకు పొడిగింపునిచ్చిన విషయం తెలిసిందే.

Videos

మమ్మల్ని కుక్కలకన్నా హీనంగా చూస్తున్నారు అన్న... తాటిపర్తి ముందు వెలిగొండ నిర్వాసితులు కన్నీరు

మీరు ఏమైనా అనుకోండి జనసేన ఒక చెత్త పార్టీ..! జనసేన నాయకుల భార్యలే మనుసులా

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్.. బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

పోలవరం అంటే గుర్తొచ్చేది YSR... బాబు క్రెడిట్ చోరీపై ఉండవల్లి సెటైర్లు

తెలంగాణ క్యాబినెట్ లో భారీ మార్పులు.. నెక్స్ట్ టార్గెట్ వాళ్లేనా..?

ఏపీ పోలీసులపై హైకోర్టు ఆగ్రహం

రేవంత్ బ్లాక్ మెయిల్... ఢిల్లీలో జరిగింది ఇదేనా..? కొండా సురేఖపై కుట్ర నిజమేనా..?

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)