Breaking News

సీఎం ఎంపికపై మల్లగుల్లాలు.. ఢిల్లీకి వసుంధర రాజే!

Published on Thu, 12/07/2023 - 06:52

రాజస్థాన్ ముఖ్యమంత్రి  ఎవరనేది ఇంకా తేలలేదు. ఈ నేపధ్యంలో మాజీ ముఖ్యమంత్రి వసుంధర రాజేను బీజేపీ హైకమాండ్ ఢిల్లీకి పిలిపించింది. రాజే బుధవారం రాత్రి 10:30 గంటలకు ఇండిగో ఎయిర్‌వేస్ విమానంలో ఢిల్లీకి చేరుకున్నారు. వసుంధర రాజే గురువారం ఉదయం జేపీ నడ్డా, అమిత్ షాలతో భేటీ కానున్నారు. 

రాజస్థాన్‌లో అధికారాన్ని వసుంధర రాజేకు అప్పగించాలని పార్టీ హైకమాండ్ మరోసారి భావిస్తున్నట్లు చర్చ సాగుతోంది. డిసెంబరు 3న రాజస్థాన్‌లో బీజేపీకి మెజారిటీ వచ్చిన తరుణంలో ముఖ్యమంత్రి  ఎవరనేదానిపై చర్చ మొదలైంది. రాష్ట్ర ముఖ్యమంత్రి రేసులో చాలా మంది పేర్లు వినిపించాయి. ఈ జాబితాలో వసుంధర రాజే, అర్జున్ రామ్ మేఘ్వాల్, గజేంద్ర సింగ్ షెకావత్, రాజేంద్ర రాథోడ్, దియా కుమారి, బాబా బాలక్‌నాథ్, ఓం బిర్లా పేర్లు ఉన్నాయి.

సీఎం రేసులో అనేక మంది పేర్లు ఉండటంతో వసుంధర రాజే చురుకుగా వ్యవహరిస్తున్నారు. ఎమ్మెల్యేలను ఆమె విందుకు ఆహ్వానించారు. ఈ నేపధ్యంలో దాదాపు 70 మంది ఎమ్మెల్యేలు ఆమెను ముఖ్యమంత్రిని చేసేందుకు అంగీకరించారని వసుంధర మద్దతుదారులు చెబుతున్నారు. అటువంటి పరిస్థితిలో రాజే ఢిల్లీకి వెళ్లడం ఆసక్తికరంగా మారింది. 
ఇది కూడా చదవండి: ఎంపీ పదవికి 10 మంది రాజీనామా

Videos

జనసేన MLAపై బాబు సీరియస్

స్మృతి మందాన రికార్డు సెంచరీ.. సెమిస్ లో భారత్

24 క్యారెట్ గోల్డ్ కు LOAN ఎందుకు ఇవ్వరు? అసలు కారణం ఇదే

బాహుబలి, RRR రికార్డ్స్ పై కన్నేసిన ఇరుముడి..

నేపాల్ లో మృత్యుఘోష..! 1300కు చేరువలో మృతులు

కడప TDPలో మేయర్ పీఠం కోసం వార్..

మంటల్లో కాలిపోయిన ప్రైవేట్ బస్సు..!

వైరల్ అవుతున్న కొండా మురళీ ట్వీట్

ఇస్రో మరో ఘన విజయం.. GSLV-F07 రాకెట్ ప్రయోగం సక్సెస్..!

ప్రజలకు శ్రీకృష్ణాష్టమి శుభాకాంక్షలు తెలిపిన YS జగన్

Photos

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు