Breaking News

ఐటీ ఉద్యోగుల్లో ఒంటరి తనం.. కారణం ఇదే

Published on Wed, 07/24/2024 - 21:27

ఇటీవల మైక్రోసాఫ్ట్‌లో పనిచేస్తున్న ఓ ఐటీ ఉద్యోగి ఆటో డ్రైవర్‌గా మారాడు. అందుకు కారణం ఒంటరితనాన్ని భరించలేక, నలుగురితో మాట్లాడే అవకాశం కోసం ఇలా ఆటో నడుపుతున్నట్లు చెప్పుకొచ్చాడు. దీంతో సదరు టెక్కీ ఆటో నడుపుతున్న ఫొటో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. 

అయితే బెంగళూరు నగరంలో ఇలాంటి ఘటనలు ఎక్కువగా ఉండడంపై బిట్స్‌ ఫిలానీ పూర్వ విద్యార్ధి హర్ష్‌ బెంగళూరులోని టెక్కీల పరిస్థితుల గురించి పోస్ట్ చేశారు.  

 ఒంటరితనం, పర్సనల్‌ లైఫ్‌-ప్రొఫెషనల్‌ లైఫ్‌ బ్యాలెన్స్‌ లేకపోవడం, శారీరక, మానసిక అంశాలు ప్రతికూల ప్రభావాన్ని చూపుతున్నాయి. 

‘బెంగుళూరులో చాలా మంది టెక్కీలు చాలా ఒంటరిగా ఉన్నారు. కుటుంబానికి దూరంగా ఉంటున్నారు. వారికి నిజమైన స్నేహితులు ఉండరు. ట్రాఫిక్‌ కష్టాలు,భారీగా ఇంటి రెంట్లు,పిల్లలు వారికి గౌరవం ఇవ్వకపోవడం, టెక్ మీట్ అప్‌లు, కాఫీ - ఆల్కహాల్‌ అధికంగా సేవించడం, ఎయిర్‌ లాస్‌ అవ్వడం, పొట్టలు విపరీతంగా పెరిగిపోవడం, అధిక మొత్తంలో పన్నులు చెల్లించడం వంటి కారణాలు ముడిపడి ఉన్నాయని, అందుకే బెంగళూరులో పనిచేస్తున్న టెక్కీల్ని ఒంటరితనం ఆవహించేస్తోంది అని ట్వీట్‌ చేశారు.  

దీని నుంచి బయటపడాలంటే ఆరోగ్యం పట్ల శ్రద్ద, కుటుంబంతో సంతోషంగా గడిపేందుకు ప్రయత్నించండి అంటూ ట్వీట్‌లో పేర్కొన్నారు. అంతే ఈ పోస్ట్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ పోస్ట్‌ని 6.94 లక్షల మంది వీక్షించారు. 12వేల మంది లైక్‌ చేశారు.  

Videos

బాబుకు హైకోర్టు షాక్.. బండి దీప్తి సంచలన కామెంట్స్

ఎమ్మెల్యే మాధవిరెడ్డి భర్త ఛాలెంజ్.. ఇచ్చిపడేసిన కడప YSRCP నేతలు

ఈ రోజు కరకట్టలో కూర్చొని ముసిముసి నవ్వులు నవ్వొచ్చు.. రేపు అనేది మీ ఊహకే వదిలేస్తున్నాం

మా కార్యకర్తలను చంపడానికా ఈ ఎలక్షన్ లు పెట్టారు.. SECని నిలదీసిన YSRCP నేతలు

టీడీపీ గూండాల దాడిపై వైఎస్ జగన్ ప్రెస్ మీట్

నామినేషన్లపై పెద్దిరెడ్డి సంచలన కామెంట్స్

దాండియా వేడుకల్లో విషాదం.. విద్యార్థిని మృతి, పలువురికి గాయాలు

ముళ్ల కంచెలతో దిగ్బంధం.. పోలీస్ Vs వైఎస్ఆర్ సీపీ

ఏపీలో రాష్ట్రపతి పాలన?

కోల్ కతాలో దుర్గా పూజ వేడుకల్లో తీవ్ర విషాదం.. 19 మంది దుర్మరణం

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)