Man Ki Baat: సంకల్పానికి, సాహసానికి ఆపరేషన్ సిందూర్ ప్రతీక: మోదీ
Breaking News
Nagin Dance: నడిరోడ్డుపై శ్రీదేవీ పాటకు నాగిని డ్యాన్స్‌తో రచ్చ రచ్చ
Published on Tue, 07/12/2022 - 16:13
Nagin Dance On Truck Horn: పుర్రెకో బుద్ది.. జిహ్వకో రుచి అనే సామెతకు కొందరు యువకులు తగిన న్యాయం చేశారు. రోడ్డుపై నాగిని డ్యాన్స్‌లు చేస్తూ కేకలు పెడుతూ రచ్చ రచ్చ చేశారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దేశవ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ క్రమంలో కొందరు బైక్ రైడర్స్ వర్షాన్ని ఎంజాయ్ చేస్తూ నాగిని డ్యాన్స్ చేస్తూ హంగామా చేశారు. ఈ ఘటన కర్నాటకలో చోటుచేసుకుంది.
వివరాల ప్రకారం.. నార్త్ కర్నాటకలో కొందరు బైక్ రైడర్లు రోడ్డుపై వెళ్తున్నారు. ఈ క్రమంలో అటుగా వస్తున్న ఓ ట్రక్కు డ్రైవర్ హారన్ మోగించాడు. ఆ హారన్ నాగిన్ డ్యాన్స్‌కు సంబంధించింది. దీంతో, బైకర్లు రోడ్డు పక్కనే బైకులను పార్కింగ్ చేసి డ్యాన్స్ చేయడం ప్రారంభించారు. ఈ క్రమంలో డ్రైవర్‌ను సాంగ్ పెట్టమని సైగలు చేశారు. అదే జోష్‌లో ట్రక్కు డ్రైవర్.. శ్రీదేవి నటించిన 'నాగీనా'లోని "మెయిన్ తేరీ దుష్మాన్" సాంగ్‌ను ప్లే చేశాడు. దీంతో, రైడర్లు మరింత రెచ్చిపోయారు. రోడ్డు మీద పడుకుని దొర్లుతూ.. డ్యాన్స్ చేశారు. కాగా, దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో ట్రెండింగ్‌లో నిలిచింది. ఈ వీడియోపై నెటిజన్లు ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు.
मजे है जैसे में आप ले पाओ वैसे लो 🤣#BachelorNation #party #nagindance pic.twitter.com/d0z9zvYsc1
— नटखट निड 🚩 (@natkhatnids) July 12, 2022
ఇది కూడా చదవండి: లైవ్‌లో కుర్రాడి దవడ పగలగొట్టిన రిపోర్టర్.. ఎట్టకేలకు ఆమె స్పందన
Tags : 1