Breaking News

మాన ప్రాణాల కోసం పరిగెత్తి..

Published on Wed, 08/13/2025 - 09:58

చట్టాలు, కఠిన శిక్షలు.. మానవ మృగాలకు అడ్డుకట్ట వేయలేకపోతున్నాయి. దేశంలో నిత్యం ఏదో ఒకమూల ఘోరాలు జరుగుతూనే ఉన్నాయి. తాజాగా సీసీ కెమెరాల సాక్షిగా జరిగిన ఓ దాష్టీకం వెలుగులోకి వచ్చింది. తన మాన ప్రాణాలు కాపాడుకునేందుకు ఓ యువతి రోడ్డుపై పరుగులు తీసిన దృశ్యాలు అందులో ఉ‍న్నాయి.

కొందరు కీచకులు ఓ బధిర యువతిని బైకుల మీద వెంటాడి.. ఎత్తుకెళ్లి మరీ అఘాయిత్యానికి పాల్పడ్డారు. పోలీసులు ప్రకటనకు విరుద్ధంగా.. సీసీటీవీ ఫుటేజీ ద్వారా  ఈ నేరానికి సంబంధించిన వాస్తవ దృశ్యాలు వెలుగులోకి వచ్చాయి.

ఉత్తర ప్రదేశ్‌లోని బలరామ్‌పూర్‌లో ఈ దారుణం చోటు చేసుకుంది. సోమవారం సాయంత్రం తన బంధువు ఇంటి నుంచి తన ఇంటికి నడుచుకుంటూ వస్తున్న యువతిపై సామూహిక అత్యాచారం జరిగింది!. ఆమె ఎంతకీ ఇంటికి రాకపోవడంతో బంధువులు ఆందోళనతో గాలించగా.. పోలీస్‌ అవుట్‌పోస్ట్‌ సమీపంలోని పొదల్లో దుస్తులు చినిగిపోయి స్పృహ లేని స్థితిలో ఆమె కనిపించింది.

వెంటనే బంధువులు ఆస్పత్రికి తరలించి.. పోలీసులకు సమాచారం అందించారు. బాధితురాలి ఫిర్యాదును స్వీకరించి.. వైద్యపరీక్షల అనంతరం ఆమెపై అత్యాచారం జరిగిందని నిర్ధారించారు. బైక్‌ మీద వచ్చిన వ్యక్తి తన వెంటపడ్డాడని.. అతని నుంచి రక్షించుకునేందుకు పరిగెత్తానని ఆమె తెలిపింది. ఈ ఘటనకు సంబంధించి కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడి కోసం గాలింపు చేపట్టినట్లు ప్రకటించారు. అయితే.. 

ఈ కేసులో పోలీసుల తీరుపై సర్వత్రా విమర్శలు వినిపిస్తున్నాయి. సాక్షాత్తూ జిల్లా మెజిస్ట్రేట్‌, ఎస్పీ, ఇతర ఉన్నతాధికారులు ఉండే బంగ్లా సమీపంలోనే ఈ దారుణం చోటు చేసుకోవడంపై పలువురు మండిపడుతున్నారు. అదే సమయంలో.. యువతిపై జరిగింది సామూహిక అత్యాచారమని బాధిత కుటుంబం అంటోంది. ఈలోపు స్థానికంగా ఉన్న ఓ సీసీటీవీ ఫుటేజీలో బైక్‌ మీద కొందరు ఆమెను వెంబడించిన దృశ్యాలు బయటకు వచ్చాయి. దీంతో పోలీసులు ఆ ఫుటేజీని పరిశీలించి ఇప్పటిదాకా ఇద్దరిని అరెస్ట్‌ చేశారు.

Videos

YSRCP నేతలు నామినేషన్లు వేయకుండా TDP మూకల దాడి

జగనన్న నాపై పెట్టిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటా

మా మిథున్ రెడ్డిని చంపేస్తారా? TDP గూండాల దాడిపై పెద్దిరెడ్డి రియాక్షన్..

రాష్టపతి దృష్టికి ఎంపీ మిథున్ రెడ్డి పై దాడి ఘటన

గంభీర్ మాస్టర్ ప్లాన్ .. వన్డేల నుండి బుమ్రా అవుట్?

నామినేషన్ కు ర్యాలీగా YS అవినాష్ రెడ్డి

మిథున్ రెడ్డికి జగన్ పరామర్శ TDP దాడులపై రియాక్షన్

LIVE : టీడీపీ గూండాల దాడులపై మిథున్ రెడ్డి సంచలన Press Meet

ఎన్నికల్లోనూ రెడ్ బుక్ రాజ్యాంగం.. మిథున్ రెడ్డిపై హత్యాయత్నం రోజా రియాక్షన్

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)