Breaking News

లోక్‌సభ ఎన్నికల్లో ఒంటరి పోటీ: బీజేడీ

Published on Sat, 05/13/2023 - 06:07

భువనేశ్వర్‌: ఏ పార్టీతోనూ తమకు పొత్తు లేదని, ఏ కూటమిలోనూ తాము భాగస్వామి కాదని ఒడిశాలో అధికార బిజూ జనతాదళ్‌(బీజేడీ) సీనియర్‌ నాయకుడు ఒకరు చెప్పారు. వచ్చే ఏడాది జరగబోయే లోక్‌సభ ఎన్నికల్లో ఒంటరిగానే పోటీ చేస్తామని, దీనిపై తమ అధినేత నవీన్‌ పట్నాయక్‌ ఇప్పటికే స్పష్టత ఇచ్చారని తెలియజేశారు. అన్ని పార్టీలతో సమదూరం పాటిస్తున్నామని వివరించారు.

ఒడిశా రాష్ట్ర ప్రయోజనాలు, అభివృద్ధే తమ ప్రధాన అజెండా అని వెల్లడించారు. నవీన్‌ పట్నాయక్‌ మిత్రుడైన బిహార్‌ ముఖ్యమంత్రి నితీశ్‌ కుమార్‌ ప్రతిపాదిస్తున్న థర్డ్‌ ఫ్రంట్‌కు దూరంగా ఉంటామని అన్నారు. నవీన్‌ పట్నాయక్‌ గురువారం ఢిల్లీలో ప్రధాని నరేంద్ర మోదీతో సమావేశమయ్యారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. థర్డ్‌ ఫ్రంట్‌లో తమ పాత్ర ఏమీ ఉండదని స్పష్టం చేశారు. నవీన్‌ పట్నాయక్‌ అంతకుముందు నితీశ్‌ కుమార్‌తో భేటీ అయ్యారు. వారు ఏం మాట్లాడుకున్నారన్నది తెలియరాలేదు.

Videos

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్ బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

తగ్గదేలే...మీసం మెలేసిన కొండా మురళి

ఫుల్ స్పీడ్ లో రవితేజ.. Next ప్రాజెక్ట్ ఎవరితో అంటే!

LIVE : కొండా సురేఖ సంచలన ప్రెస్ మీట్

భయం పట్టుకుంది అందుకే పోలవరం గురించి మాట్లాడటం మానేశా

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)