Breaking News

Bihar: పోలీసులతో ఘర్షణ...మెడికోలకు గాయాలు!

Published on Mon, 07/22/2024 - 08:38

ముజఫర్‌పూర్: బీహార్‌లోని ముజఫర్‌పూర్‌లోని శ్రీ కృష్ణ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్(ఎస్‌కేఎంసీహెచ్‌)లో వైద్య విద్యార్థులు, పోలీసుల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. ఈ నేపధ్యంలో విద్యార్థులపై పోలీసులు లాఠీచార్జ్ చేయడంతో పలువురు జూనియర్ డాక్టర్లు, వైద్య విద్యార్థులు గాయపడ్డారు. కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఇంతలో పోలీసుల చర్యను నిరసిస్తూ వైద్యులు సమ్మెకు దిగారు.

పోలీసుల లాఠీచార్జి అనంతరం వైద్య విద్యార్థులు పోలీసులపై రాళ్లు రువ్వారు. లాఠీ ఛార్జీకి నిరసనగా ఎస్‌కేఎంసీహెచ్‌లో వైద్యులు ఎమర్జెన్సీతో సహా అన్ని సేవలను నిలిపివేశారు. సమ్మెకు దిగుతున్నట్లు జూనియర్‌ డాక్టర్లు ప్రకటించారు. ఈ ఘటనకు దారితీసిన వివరాల్లోకి వెళితే ఆదివారం రాత్రి 12 గంటల సమయంలో ముగ్గురు వైద్య విద్యార్థులు బైక్‌పై మార్కెట్‌ నుంచి తిరిగి వస్తున్నారు. మెడికల్ కాలేజీ గేటు నంబర్ త్రీ దగ్గర అహియాపూర్ పోలీస్ స్టేషన్ పెట్రోలింగ్ అధికారి వీరిని ఆపారు.

ఈ నేపధ్యంలో వారు పోలీసులతో వాగ్వాదానికి దిగారు. దీంతో పోలీసులు ఒక వైద్య విద్యార్థిని పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ఈ విషయాన్ని మిగిలిన వైద్య విద్యార్థుల వాట్సాప్ గ్రూప్‌లో విద్యార్థులందరికీ షేర్‌ చేశారు. దీంతో అక్కడకు చేరుకున్న విద్యార్థులంతా పోలీసు పెట్రోలింగ్ బృందాన్ని చుట్టుముట్టారు. ఈ సమాచారం అందుకున్న పోలీసులు నాలుగు వాహనాల్లో ఎస్‌కెఎంసిహెచ్‌కి చేరుకున్నారు. అనంతరం వారు విద్యార్థులపై లాఠీచార్జి చేశారు. ఈ ఘటనలో పలువురు విద్యార్థులు ప్రాణాలు కాపాడుకునేందుకు పరుగులు తీశారు. విషయం తెలుసుకున్న రోగులు, వారి బంధువులు భయాందోళనలతో ఆస్పత్రి నుంచి బయటకు పరుగులు తీశారు. పోలీసుల లాఠీచార్జిలో గాయపడిన వైద్య విద్యార్థులను ఆస్పత్రికి తరలించారు.

#

Tags : 1

Videos

దసరాకి RC ఫాన్స్ కు అదిరిపోయే న్యూస్..!

హైకోర్టులో YSRCP పిటిషన్.. పొన్నవోలు వాదనలు

అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో అయ్యన్నపాత్రుడికి షాక్

కడపలో ఉద్రిక్తత నామినేషన్ పత్రాలు చించివేత

YSRCP నేతలు నామినేషన్లు వేయకుండా TDP మూకల దాడి

జగనన్న నాపై పెట్టిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటా

మా మిథున్ రెడ్డిని చంపేస్తారా? TDP గూండాల దాడిపై పెద్దిరెడ్డి రియాక్షన్..

రాష్టపతి దృష్టికి ఎంపీ మిథున్ రెడ్డి పై దాడి ఘటన

గంభీర్ మాస్టర్ ప్లాన్ .. వన్డేల నుండి బుమ్రా అవుట్?

నామినేషన్ కు ర్యాలీగా YS అవినాష్ రెడ్డి

Photos

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)