Breaking News

వెట్టి చాకిరీ నుంచి తప్పించుకోవడానికి...

Published on Sat, 08/09/2025 - 08:21

గురుగ్రామ్‌:  ప్రాథమిక విద్య హక్కుగా ఉన్నా... అది ఆచరణకు నోచుకోవడం లేదు. బాల కార్మిక నిర్మూలనకు ప్రభుత్వాలెన్ని పథకాలు పెడుతున్నా.. అమలులో విఫలమవుతూనే ఉందని మళ్లీ మళ్లీ రుజువవుతూనే ఉంది. తాజాగా బీహార్‌కు చెందిన ఓ బాలుడు.. ఆ వెట్టి నుంచి తప్పించుకోవడానికి 150 కిలోమీటర్లు నడిచాడు. చివరకు తన చేయి కూడా పోగొట్టుకున్నాడు. వివరాల్లోకి వెళ్తే.. 15 ఏళ్ల బాలుడు హర్యానా, జింద్‌ జిల్లాలోని ఒక పాడి పరిశ్రమలో కార్మికుగా పనిచేస్తున్నాడు. 

అతని స్వస్థలం బీహార్‌లోని కిషన్‌గంజ్‌ జిలా. నెలకు రూ.10,000 వేతనం ఇస్తామన్న హామీతో అతడిని పనిలోకి తీసుకెళ్లారు. డైరీ ఫామ్‌లో అతన్ని మోటరైజ్డ్‌ ఫీడర్‌ చాపర్‌ ఆపరేటర్‌గా పెట్టారు. ఆ ఫామ్‌ దగ్గరే ఓ గదిలో నివాసం. వేతనం మాట అటుంచితే.. సరైన ఆహారం కూడా పెట్టలేదు. చాపర్‌ ఆపరేటర్‌గా పనిచేస్తున్ను సమయంలో అతని చేతికి గాయమైంది. ఆ తరువాత అపాస్మరక స్థితిలోకి వెళ్లిపోయాడు. మెలకువ వచ్చేసరికి అతను డిస్పెన్సరీలో ఉన్నాడు. ప్రాథమిక చికిత్స చేసిన డిస్పెన్సరీ సిబ్బంది బాలుడిని వెళ్లిపోవాల్సిందిగా సూచించారు. మళ్లీ ఫామ్‌కు వెళ్లడం ఇష్టం లేని బాలుడు బీహార్‌కు నడక మొదలు పెట్టాడు. 

దాదాపు వెయ్యి కిలోమీటర్ల దూరం మొండిగా వెళ్లాలి. దాదాపు 150 కిలోమీటర్లు నడిచిన తరువాత నుహ్‌జిల్లాలోని టౌరు సమీపంలో అతన్ని ఇద్దరు ప్రభుత్వ ఉపాధ్యాయులు చూశారు. భోజనం పెట్టి, పోలీసులకు అప్పగించారు. వివరాలు అడిగి తెలుసుకున్న పోలీసులు.. చేతి గాయానికి చికిత్స కోసం నుహ్‌ ప్రభుత్వ ఆరోగ్య కేంద్రంలో చేర్పించారు. అతని సోదరుడు, ఇతర బంధువులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న కుటుంబం హుటాహుటిన వచి్చన బాలుడిని తీసుకెళ్లి ఆస్పత్రిలో చేరి్పంచారు. గాయం తీవ్రమవ్వడంతో మోచేతి వరకు చేయిని తొలగించాల్సి వచి్చంది.   

#

Tags : 1

Videos

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Nellore: అధికారుల ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన చంద్రశేఖర్ రెడ్డి

అడ్డుకోవాలని చూసారు పోలీసులకు ఇచ్చిపడేసిన రోజా

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రేష్మ నామినేషన్ తిరస్కరణ...

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

Photos

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)