Breaking News

Bihar polls: చివర్లో ఆర్జేడీకి వీఐపీ షాక్‌

Published on Tue, 11/11/2025 - 12:32

పట్నా: బిహార్‌ అసెంబ్లీ ఎన్నికల రెండవ దశ పోలింగ్‌ నేడు(మంగళవారం) జరుగుతోంది. ఇంతలో వికాశ్‌ శీల్ ఇన్సాన్‌ పార్టీ(వీహెచ్‌పీ)‌.. రాష్ట్రీయ జనతాదళ్ (ఆర్‌జేడీ)కి షాకిచ్చింది. బీహార్‌లోని ప్రతిపక్ష కూటమిలో వీఐపీ రెండవ దశ అసెంబ్లీ పోలింగ్‌కు ముందు కైమూర్ జిల్లాలోని నాలుగు స్థానాల్లో పోటీ చేస్తున్న ఆర్జేడీ అభ్యర్థులకు మద్దతు ఉపసంహరించుకుంటున్నట్లు ప్రకటించింది.

ఆదివారం భబువాలో ఆర్జేడీ చీఫ్ తేజస్వి యాదవ్ ఎన్నికల ర్యాలీ నిర్వహించాక, చైన్పూర్  వీఐపీ అభ్యర్థికి మద్దతు పలికేందుకు ఆయన నిరాకరించిన దరిమిలా రాష్ట్ర జిల్లా వీహెచ్‌  చీఫ్ బాల్ గోవింద్ బింద్ ఈ ప్రకటన చేశారు. చైన్పూర్ (కైమూర్, గౌరా బౌరం (దర్భంగా) స్థానాల్లో ఆర్జేడీ, వీఐపీలు స్నేహపూర్వకంగా  ఎన్నికల బరిలోకి దిగాయి. నవంబర్ 4న వీఐపీ చీఫ్ గౌరా బౌరం నుండి తన సోదరుడు సంతోష్ సాహ్ని అభ్యర్థిత్వాన్ని ఉపసంహరించుకుని, అఫ్జల్ అలీ ఖాన్ (ఆర్జేడీ)కి మద్దతు ప్రకటించారు. ఈ మేరకు ముఖేష్ సాహ్ని.. తేజస్వీ యాదవ్ ఒక అవగాహనకు వచ్చారు.

కాగా చైన్పూర్ బీజేపీ అభ్యర్థి బ్రిజ్ కిషోర్ బింద్‌ను బాల్ గోవింద్ బింద్‌కు అనుకూలంగా ఉపసంహరించుకునేందుకు ఆర్జేడీ అంగీకరించిందని వీఐపీ నేతలు పేర్కొన్నారు. శుక్రవారం చైన్పూర్‌లో తమ అభ్యర్థికి మద్దతుగా జరిగిన ఎన్నికల ర్యాలీలో ముఖేష్ సాహ్ని దీనిని ధృవీకరించారు. దీంతో తేజస్వీ యాదవ్.. ఆర్జేడీ అభ్యర్థికి ఫోన్ చేసి, అభ్యర్థిత్వాన్ని ఉపసంహరించుకోవాలని కోరారు. అయితే ఆయన అందుకు నిరాకరించారు.

దీంతో తేజస్వీ యాదవ్ వీఐపీ చైన్పూర్ అభ్యర్థిని బ్లాక్ అభ్యర్థిగా ప్రకటించారు. అయితే వీఐపీ అభ్యర్థి చైన్పూర్‌లో తేజస్వీ యాదవ్ కోసం ఒక వేదికను ఏర్పాటు చేశారు. అయితే తేజస్వీ యాదవ్‌ భబువాలో ర్యాలీ నిర్వహించి, ఆర్జేడీ అభ్యర్థికి  ఓట్లు వేయాలని విజ్ఞప్తి చేశారు. దీంతో కైమూర్‌లో ఆర్జేడీ అభ్యర్థికి వీఐపీ మద్దతును ఉపసంహరించుకుంది. సోమవారం బాల్ గోవింద్ బింద్ మాట్లాడుతూ, కైమూర్‌లోని నాలుగు స్థానాలకు ఆర్జేడీతో పొత్తు ముగిసిందని ప్రకటించారు. దీనిపై ఆర్జేడీ స్పందించలేదు.

ఇది కూడా చదవండి: ఢిల్లీ పేలుడు: ఈ కష్టం పగవాడికి కూడా.. కండక్టర్‌ విషాదాంతం

Videos

వైరల్ అవుతున్న కొండా మురళీ ట్వీట్

ఇస్రో మరో ఘన విజయం.. GSLV-F07 రాకెట్ ప్రయోగం సక్సెస్..!

ప్రజలకు శ్రీకృష్ణాష్టమి శుభాకాంక్షలు తెలిపిన YS జగన్

బిడ్డ వ్యాఖ్యలను సురేఖ ఖండించాలి.. కానీ ఆమె ఆ పని చేయలేదు

అడ్డంగా బుక్కైన లోకేష్ ..! అర్హత ఉన్న స్వాతికి నో జాబ్.. టెట్ లో ఫెయిల్ వ్యక్తికి టీచర్ జాబ్?

మమ్మల్ని కుక్కలకన్నా హీనంగా చూస్తున్నారు అన్న... తాటిపర్తి ముందు వెలిగొండ నిర్వాసితులు కన్నీరు

మీరు ఏమైనా అనుకోండి జనసేన ఒక చెత్త పార్టీ..! జనసేన నాయకుల భార్యలే మనుసులా

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్.. బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

పోలవరం అంటే గుర్తొచ్చేది YSR... బాబు క్రెడిట్ చోరీపై ఉండవల్లి సెటైర్లు

తెలంగాణ క్యాబినెట్ లో భారీ మార్పులు.. నెక్స్ట్ టార్గెట్ వాళ్లేనా..?

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)