Breaking News

Bihar Elections: బీజేపీపై ఆగ్రహం.. స్వతంత్రంగా పోటీ.. క్షణంలో మారిన సీన్‌

Published on Sun, 10/19/2025 - 08:05

పట్నా: బీహార్‌లో నవంబర్‌లో జరగనున్న ఎన్నికల్లో తొలి దశ పోలింగ్‌నకు సంబంధించి,  అభ్యర్థుల నామినేషన్‌ ప్రక్రియ కొనసాగుతోంది. ఇంతలో ఒక ఉదంతం మీడియా దృష్టిని ఆకర్షించింది. భాగల్‌పూర్‌ బీజేపీ టికెట్ లభించకపోవడంతో కలత చెందిన మాజీ కేంద్ర మంత్రి అశ్విని చౌబే కుమారుడు అర్జిత్ శశ్వత్ చౌబే స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేసేందుకు సిద్ధమయ్యారు. అయితే ఇంతలో వచ్చిన ఒక ఫోన్‌ కాల్‌తో క్షణంలో అతని నిర్ణయం మారిపోయింది.

నామినేషన్‌ దాఖలు చేసేందుకు అభ్యర్థి అర్జిత్ శశ్వత్ చౌబే జిల్లా కలెక్టరేట్ ప్రాంగణానికి చేరుకోగానే, అతని మద్దతుదారులు అతనికి పూలమాలలు వేసి, మరింత ఉత్సాహపరిచారు. ఇంతలో శశ్వత్ చౌబే ఫోన్  రింగ్‌ అయ్యింది. అదే సమయంలో అతనితో మాట్లాడేందుకు విలేకరులు వేచివున్నారు.  శశ్వత్ చౌబే తనకు వచ్చిన కాల్‌ తీసుకుని, నామినేషన్‌ పత్రాలను దాఖలు చేయకుండా వెనుదిరిగారు. తరువాత తాను ఊహించని విధంగా యూ టర్న్‌ తీసుకోవడానికి గల  కారణాన్ని మీడియాకు వివరించారు.

తన తండ్రి అశ్విని చౌబే  సూచనల మేరకు బీజేపీలోనే  ఉంటానని శశ్వత్ చౌబే స్పష్టం చేశారు. తన తండ్రి మాటను మన్నిస్తూ, ఆయనకు గౌరవాన్నిస్తూ, ఎన్నికల్లో పోటీ నుండి వైదొలగాలని నిర్ణయించుకున్నానని తెలిపారు. తాను స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేయనున్నట్లు ప్రకటించగానే, బీజేపీ అగ్ర నాయకత్వం నుండి ఒత్తిడిని ఎదురయ్యిందని శశ్వత్ చౌబే పేర్కొన్నారు.‘ఈరోజు, నా  తల్లిదండ్రులు  నాతో మాట్లాడారు. ఇది బీజేపీ అగ్ర నాయకత్వం నుండి వచ్చిన సూచన. నేను వారికి అవిధేయునిగా ఉండలేను. నేను నా పార్టీకి, దేశానికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేయలేను.వారిని వ్యతిరేకించలేను’ అని శశ్వత్ చౌబే మీడియాకు తెలిపారు.

 

Videos

సీఎం రేవంత్ మార్పు ఖాయం? BRS రాకేష్ కుమార్ షాకింగ్ కామెంట్స్

గుంటూరు పెదకాకానిలో హై టెన్షన్

జనసేన MLAపై బాబు సీరియస్

స్మృతి మందాన రికార్డు సెంచరీ.. సెమిస్ లో భారత్

24 క్యారెట్ గోల్డ్ కు LOAN ఎందుకు ఇవ్వరు? అసలు కారణం ఇదే

బాహుబలి, RRR రికార్డ్స్ పై కన్నేసిన ఇరుముడి..

నేపాల్ లో మృత్యుఘోష..! 1300కు చేరువలో మృతులు

కడప TDPలో మేయర్ పీఠం కోసం వార్..

మంటల్లో కాలిపోయిన ప్రైవేట్ బస్సు..!

వైరల్ అవుతున్న కొండా మురళీ ట్వీట్

Photos

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు